BigTV English

Mamata Banerjee : నేతాజీ అదృశ్యం.. మిస్టరీ తెలియకపోవడం దేశానికే అవమానం..

Mamata Banerjee : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhas Chandra Bose) అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం కాని, ఆయన మరణించిన తేదీ కాని దేశ ప్రజలకు ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని బీజేపీ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందన్నారు. దాన్ని ఇప్పటికి వరకు నిలబెట్టుకోలేదని ఆమె విమర్శించారు.

నేతాజీ 127వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని ఆయన విగ్రహానికి మమతా బెనర్జీ నివాళ్లు అర్పించారు. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. నేతాజీ చనిపోయిన తేదీ తెలియకపోవడం దేశ దురదృష్టమన్నారు. ఆయనకు ఏమైందో మనకు తెలియదు, ఇది దేశానికే సిగ్గుచేటని పేర్కొన్నారు.

నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 20 ఏళ్లుగా నేతాజీ జన్మదినం నాడు జాతీయ సెలవు ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలమవుతున్నాయన్నారు. అందుకు ప్రజలు తనను క్షమించాలని మమత బెనర్జీ పేర్కొన్నారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని దీదీ.. ప్రస్తావించారు. ఈ రోజుల్లో రాజకీయ ప్రచారానికీ సెలవు ప్రకటిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు.

భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యమైన ఘటన ఏడు దశాబ్దాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945, ఆగస్టు 18న తైపిలో విమాన ప్రమాదంలో బోస్‌ మరణించారనే వాదన ఉంది. నేతాజీకి చెందినవిగా చెబుతోన్న చితాభస్మం నింపిన పాత్రను 1945 సెప్టెంబరు నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు.

నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు దర్యాప్తు కమిషన్లు వేసింది. కాంగ్రెస్‌ హయాంలో రెండు,బీజేపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఇచ్చిన నివేదికలు భిన్నంగా ఉన్నాయి. దీంతో అస్థికలను భారత్‌కు తెప్పించి, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని బోస్‌ కుటుంబీకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×