Vijayawada Politics: ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఏం జరుగుతోంది? వైసీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? ఈ వ్యవహారాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? నాని అస్త్రాన్ని బయటకు వదిలిందా? టీడీపీని టచ్ చేయకుండా తమ్ముడు ఎంపీని టార్గెట్ చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో టీడీపీని ఇరికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. విజయవాడ మాజీ ఎంపీ కేశినాని ద్వారా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఈ వ్యవహారంలో ఎంపీ కేశినేని చిన్నిని ఇరికించి టీడీపీని బద్నాం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఒక్కో అస్త్రాన్ని విరుసుతోంది.
ఈడీకి నాని లేఖ
తాజాగా మరో అడుగు ముందుకేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ కేశినేని చిన్ని, అతని అనుచరుల పాత్రపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఈడీకి లేఖ రాశారు. ఈడీకి రాసిన లేఖను ఎక్స్‌లో పోస్టు చేశారు మాజీ ఎంపీ. ప్రధాని నరేంద్రమోదీ, పీఎంవో, అమిత్ షా, అమిత్ షా ఆఫీసు, నిర్మలసీతారామన్, చంద్రబాబు ఖాతాలకు ట్యాగ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుందేమోనని ఆసక్తిగా గమనిస్తోంది వైసీపీ.
ఈ వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని-నాని మధ్య కొన్నాళ్లుగా రగడ జరుగుతోంది. లిక్కర్ కేసులో నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ఎంపీకి సంబంధాలు ఉన్నాయంటూ గతంలో ఆరోపణలు చేయడం, ఆపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు కేశినేని నాని. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక రాలేదు. పరిస్థితి గమనించిన నాని, నాలుగైదు రోజుల తర్వాత నేరుగా ఈడీకి లేఖ రాశారు.
ALSO READ: వీర జవాన్ ఫ్యామిలీకి అండ.. ఐదు ఎకరాల భూమి, 50 లక్షలు, 300 గజాల ఇంటి స్థలం
లిక్కర్ కేసులో ఫెమా చట్టాన్ని ఉల్లఘించినట్టు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. దీనిపై కేసు నమోదు చేయడం, ఆధారాలు, ఛార్జిషీట్లు, రిమాండ్ రిపోర్టులు ఇవ్వాలని సిట్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఈడీ ఆ పనిలో నిమగ్నమైంది. ఈలోగా కేశినేని నాని లేఖ రావడంతో విజయవాడ ఎంపీపై ఈడీ దృష్టి సారిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈసారి తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు ఫుల్‌జోష్‌లో ఉన్నారు.
పరారీలో ఆ ముగ్గురు
ఈ కేసులో ముగ్గురు నిందితులు ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ఇటీవల సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తోసిపుచ్చింది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ ముగ్గురు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేసింది సిట్.
వీరిని ఏ-31. 32. 33గా పేర్కొంది సిట్. అయితే 13న హైకోర్టులో విచారణ ఉన్నందున అప్పటివరకు విచారణకు దూరంగా ఉంటారని కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. ఈ ముగ్గుర్ని లోతుగా విచారిస్తే ఈ కేసు చివరి దశకు రావచ్చని అంటున్నారు. ఈలోగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని ఇరికిస్తే తమకు కొంత రిలీఫ్ వస్తుందన్నది వైసీపీ పెద్దల ఆలోచన.