BigTV English

YCP Ticket Issue : టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి.. బుజ్జగింపుల పనిలో సీఎం జగన్..

YCP Ticket Issue : టికెట్ దక్కలేదని.. సెగ్మెంట్ మార్చారని .. సరైన గౌరవం దక్కడం లేదంటూ వైసీపీలోని పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. అలాంటి వారిలో సీనియర్లు కూడా ఉండటంతో ఉలిక్కిపడుతున్న వైసీపీ అధినేత.. వారు బయటకుపోకుండా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారంట.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోకుండా సర్ది చెప్పడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోతోందంట.. జగన్ రాయబారులు వెళ్లి ఎంత సర్దిజెప్పినా.. ఆఖరికి జగన్ స్వయంగా మాట్లాడిన సదరు నేతలు ససేమిరా అంటున్నారంట.

YCP Ticket Issue : టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి.. బుజ్జగింపుల పనిలో సీఎం జగన్..

YCP Ticket Issue : టికెట్ దక్కలేదని.. సెగ్మెంట్ మార్చారని .. సరైన గౌరవం దక్కడం లేదంటూ వైసీపీలోని పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. అలాంటి వారిలో సీనియర్లు కూడా ఉండటంతో ఉలిక్కిపడుతున్న వైసీపీ అధినేత.. వారు బయటకుపోకుండా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారంట.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోకుండా సర్ది చెప్పడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోతోందంట.. జగన్ రాయబారులు వెళ్లి ఎంత సర్దిజెప్పినా.. ఆఖరికి జగన్ స్వయంగా మాట్లాడిన సదరు నేతలు ససేమిరా అంటున్నారంట.


ఉమ్మడి క‌ృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న వైసీసీ నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోకుండా సర్ది చెప్పే మంతనాలను ఆ పార్టీ అధిష్ఠానం ఆరంభించింది.. జిల్లాలో ఇప్పటికే కొందరు వైసీపీ కీలక నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నారు. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని తాజాగా తన కార్యాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి జగన్‌ 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. వైసీపీలోనే కొనసాగాలని, తాము సముచిత స్థానం ఇస్తామంటూ నచ్చచెప్పినట్టు తెలుస్తోంది. అయినా పార్థసారథి సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

పార్థసారథికి పార్టీలో సరైన గౌరవం ఇవ్వకుండా చాలాకాలంగా అవమానించే ధోరణి అవలంబిస్తున్నట్టు ఆయన వర్గం నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఇక వైసీపీలో తాను కొనసాగలేననే నిర్ణయానికి సారథి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి జగన్‌ తీరుపై బహిరంగ వేదికపైనే ఆయన అసహనం వ్యక్తం చేశారు. జగన్‌ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తున్నారంటూ వైసీపీ సాధికార బస్సు యాత్ర సభలోనే అందరి ముందు సారథి తన అసంతృప్తిని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి సారథి పార్టీని వీడతారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.


ఈ నేపథ్యంలో పార్థసారథిని ఎలాగైనా పార్టీలో ఉంచాలని సీఎం జగన్‌ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పామర్రుఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సారథికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి వద్దకు వచ్చేందుకు సారథి అంగీకరించడంతో తాజాగా ఆయనను తీసుకెళ్లారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, కైలే అనిల్‌లు పార్థసారథిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రితో సారథి ఒంటరిగానే మాట్లాడి బయటకు వచ్చారు. జగన్‌ నచ్చజెప్పినా వైసీపీని వీడాలనే పార్థసారథి నిర్ణయంలో ఎలాంటి మార్పు కనిపించలేదని తెలిసింది.

ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నేతలు పెద్దసంఖ్యలో నేతలు సీఎంఓ వద్ద బారులు తీరుతున్నారు. కొంత మంది తమ టిక్కెట్‌ కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వెళ్లుంటే.. మరికొందరిని ముఖ్యమంత్రి పిలిపించినట్టు తెలుస్తోంది.. జిల్లాలో పార్టీకి చెందిన ప్రధాన నాయకులు ఎవరూ బయటకు పోకుండా ఉండేలా మధ్యవర్తిత్వం చేయాలంటూ కొందరికి ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం.అందులో భాగంగా ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు, వాళ్లు పక్క పార్టీలకు వెళ్లిపోతే జరిగే నష్టం ఏమిటనే విషయాలపైనా చర్చిస్తున్నారంట.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు త్వరలో వైసీపీకి గుడ్‌బై చెప్తారంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి విష్ణు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అందుకే విష్ణును బుజ్జగించేందుకు వైసీపీ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదంట. సెంట్రల్‌లో గణనీయంగా బ్రాహ్మణుల సామాజికవర్గానికి చెందిన ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది.

త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానంటూ విష్ణు తన వారికి చెబుతున్నారంట.. విష్ణును బుజ్జగించేందుకు వెలంపల్లి ప్రయత్నం చేసినా.. ఎలాంటి సానుకూల స్పందన రాలేదంట.. దీంతో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వెలంపల్లి ప్రయత్నాలు చేస్తుకుంటున్నారంట.. ఇప్పటికే వారందరితో సమావేశం కూడా పెట్టి.. తనకు సహకరించాలని కోరుతున్నా .. వారిలో అత్యధికులు మల్లాది విష్ణు వైపే మొగ్గు చూపుతున్నారంట.. మరి చూడాలి ఎన్నికల టైంకి ఏం జరుగుతుందో?

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×