BigTV English

AP Cabinate: ఎన్నికల ముందర.. ఏపీ కేబినెట్‌ వరాల జల్లు..

AP Cabinate: ఎన్నికల ముందర.. ఏపీ కేబినెట్‌ వరాల జల్లు..
cm jagan

AP cabinet meeting highlights(Latest political news in Andhra Pradesh): జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 18న జరిగే జగనన్న తోడుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 20న సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. ఈ నెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేసేందుకు మంత్రి మండలి ఓకే చెప్పింది. ఈ నెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బులు జమ చేయనుంది. ఈ నెల 28న విదేశీ విద్యాదీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు నిధులు జమ చేయనుంది.


భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన అస్సైన్డ్‌ ల్యాండ్స్‌ విషయంలో ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏలోని R-5 జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా భావనపాడు -మూలపేట పోర్టు నిర్మాణం కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 3,880 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.


భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి కింద లంక భూముల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి 750 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది.

గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 454 కోట్ల పరిహార ప్యాకేజీ మంజూరుకు మంత్రివర్గం ఓకే చెప్పింది.

అసైన్డ్ భూములపై అనుభవదారులకు సర్వహక్కులు కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 20 ఏళ్లకు ముందు కేటాయించిన భూములపై హక్కులు దక్కనున్నాయి.

వర్సీటీలో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఏపీలో అర్చకులకు రిటైర్‌మెంట్‌ వయసు లేకుండా చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×