
CM Jagan: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల తీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత వారితో ప్రత్యేకంగా చర్చించారు. పనితీరు సరిగ్గా లేదని మందలించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సరిగ్గా స్పందిండం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల్లో సీరియస్‌నెస్ కనిపించడం లేదన్నారు. పనులన్నీ క్యాంప్ ఆఫీస్ నుంచే నడిపితే ఎలా అని.. మంత్రుల్లో చాలామంది బాధ్యతగా వ్యవహారించడం లేదన్నారు. అన్నీ అన్ననే చూసుకుంటాడు అంటే కుదరదని స్పష్టం చేశారు.
జగనన్న సురక్షపై మంత్రులు ఇంకా ఫోకస్ పెట్టాలని సూచించారు. ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని సీఎం జగన్ మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. 9 నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయని.. అందుకు అందరూ సమాయత్తం కావాలని జగన్ సూచించినట్లు తెలిసింది.
ఎన్నికల టైమ్‌లో అవినీతి ఆరోపణలు లేకుండా చూసుకోవాలన్నారు సీఎం. జగనన్న సురక్ష కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని జగన్ తేల్చిచెప్పారు.