KGBV Admissions: ఆంధ్రప్రదేశ్ కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 22 నుండి ఆన్‌లైన్ 352 కేజీబీవీలకు సంబంధించి 6 నుంచి 11 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్షా ఎస్పీడీ అధికారి వెల్లడించారు.
దరఖాస్తులు మార్చి 22 నుండి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయి. ఇక 7, 8, 9, 10, 12 తరగతుల సీట్ల భర్తీ కోసం బాలికల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే కేజీబీవీల్లో అడ్మిషన్లు ముఖ్యంగా అనాథలు, బడి బయట పిల్లలు, బడి మానేసిన వారు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే.
ఈ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాలి. కేవలం ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణినలోకి తీసుకుంటారు. దరఖాస్తులను https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా పొందగలరు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. లేదంటే సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు.
ప్రవేశాల విషయంలో ఏవైనా ఇబ్బందులుంటే 70751 59996, 70750 39990 నంబర్లు సంప్రదించాలని కోరారు. పాఠశాలల్లో వృత్తి విద్య అభివృద్ధి దిశగా ఒకేషనల్ టీచర్లకు కార్యక్రమాల కోసం నాలుగు జోనల్ సెంటర్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని కేజీబీవీల్లో సోలార్ గీజర్లు, బాలికల భద్రత దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
ALSO READ: కూటమిపై కుట్ర అంత ఈజీనా?
679 మండలాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియామకం కోసం చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయాలను అభివృద్ధి చేసేందుకు దృష్టి పెట్టింది. ఏపీ ప్రభుత్వం చొరవతో సమగ్ర శిక్షా ప్రాజెక్టుకు రూ. 2361 కోట్లు, పీఏంశ్రీ పథకానికి రూ. 454 కోట్లు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిధులు సమగ్ర శిక్షా పథకంలో అమలవుతున్న కార్యక్రమాలు ఉపయోగించనున్నారు.
ఆయా కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆటిజంతో ఇబ్బంది పడుతున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా 125 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆటిజం కేంద్రాల ఏర్పాటుకు ఏపీ దేశంలో తొలిసారి ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తూ అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాల్లో అమలుపర్చేందుకు కృషి చేస్తామన్నారు.