BigTV English

Kidney Racket In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బుతో వల.. పేదలే టార్గెట్..

Kidney Racket  In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బుతో వల.. పేదలే టార్గెట్..

Kidney Racket In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. బాధితురాలి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరుకు చెందిన బూసి అనురాధ…..కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. దాదాపు 5 నుంచి 7 లక్షలు వరకు ఇస్తామంటూ కిడ్నీ ముఠా….ఆమెకు మాయమాటలు చెప్పింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆమె…..అంత డబ్బు అనేసరికి ముఠా వలలో పడింది.


ఒక కిడ్నీకి 7 లక్షలు ఇస్తామన్న ముఠా.. సర్జరీ తర్వాత 4 లక్షలే ఇచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరగ్గా….మిగతా డబ్బుకోసం బాధితురాలు ఎదురుచూసింది. చివరకు ఆ డబ్బుతో బ్రోకర్‌ ప్రసాద్‌ పారిపోయాడు. మోసపోయాయని గ్రహించి చేసేదేమీ లేక…. అనురాధ ఏలూరు వన్‌టాన్‌ పోలీసులను ఆశ్రయించింది.

పేదలకు డబ్బు ఆశచూపి కిడ్నీలు కాజేసే ముఠాలు ఏపీ అంతట చెలరేగిపోతున్నాయి. గతంలో విశాఖలోనూ ఇలాంటి వ్యవహారమే వెలుగు చూసింది. పెందుర్తిలో వినయ్‌ అనే యువకుడి కిడ్నీ కాజేశారు. ఒక కిడ్నీ అమ్మితే ఎనిమిదిన్నర లక్షలు ఇస్తామని నమ్మబలికారు. ఆపరేషన్‌ అయ్యాక 2 లక్షలు చేతిలో పెట్టి ఉడాయించారు.


ఏపీలో కిడ్నీ రాకెట్‌ దందా యథేచ్చగా సాగుతోంది. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు గానీ, పోలీసులు గానీ సరైన యాక్షన్‌ తీసుకోవడం లేదన్నది…..తాజా ఘటనే అర్థమవుతోంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామనే పేదల ఆశనే….ఈ ముఠాలను క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే ఇంకా చాలా మంది పేదలు…..కిడ్నీ రాకెట్‌ ముఠాకు బలికావల్సిందే.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×