E-Paper
Advertisement

Pawan Kalyan Comments: వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు.. కొబ్బరి రైతులతో పవన్‌కల్యాణ్

Pawan Kalyan Comments: వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు.. కొబ్బరి రైతులతో పవన్‌కల్యాణ్
Advertisement

Pawan Kalyan Comments: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వరాలు ఇవ్వడానికి తాను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది కావాలన్నా సీఎంను అడగాలన్నారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ తన దగ్గర లేదన్నారు. ఉన్న డబ్బంతా పథకాలకు ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని అన్నారు.

కొబ్బరి రైతులతో పవన్ హాట్ కామెంట్స్

Advertisement

ఫైనాన్స్ విభాగం అంతా ముఖ్యమంత్రి చేతులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నీఇన్నీ కావన్నారు. ఐదేళ్లుగా కనీసం పూడికలు తీయలేదన్నారు. ఇక కొబ్బరి రైతులకు కనీసం ఒక ఇంచీ మట్టి కూడా తీయలేదన్నారు. అప్పుడు పథకాలు ఇచ్చారని, అభివృద్ధి మరిచిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలతోపాటు అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు.

పథకాలకు నిధులు, రోడ్లు వేయాలి, తుఫాను వస్తే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. బుధవారం నాడు కోనసీమ జిల్లాలోని మలికిపురం కేశనపల్లి, శంకరగుప్తం కొబ్బరి రైతులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కేసనపల్లిలోని డ్రైనేజీని, డ్యామేజ్ అయిన కొబ్బరి చెట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా స్థానిక రైతులతో ముఖాముఖిగా మట్లాడారు.

Advertisement

వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదని వ్యాఖ్య

తానేదో తాత్కాలిక పరిష్కారంగా 20 కోట్లు ఇచ్చేసి, మీతో చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోవడానికి రావడం లేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు. కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతాంగానికి సంబంధించి శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది తొలి సమావేశమన్నారు. ఓట్ల కోసమో, మీతో చప్పట్లు కొట్టించుకోవడానికో ఇక్కడికి రాలేదన్నారు.  ఓడినా, గెలిచినా సమస్యలను పరిష్కరించాలనేది తన లక్ష్యమన్నారు.

ఎందుకంటే లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్న అంశం కాబట్టి ఇది మా బాధ్యతగా తీసుకుని పని చేస్తామన్నారు. ఇదే క్రమంలో అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కోనసీమ కొబ్బరిపై బీసీ రోశయ్య రిపోర్టు గురించి ఆరా తీశారు. రిపోర్టు గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు.

ALSO READ: ఆనాడు అనుకున్నా.. సాధించా, మాక్ అసెంబ్లీలో విద్యార్థుల స్పీచ్ అదుర్స్- సీఎం చంద్రబాబు

ఇదే క్రమంలో సచివాలయం ఉద్యోగులు ప్రమోషన్లపై డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. వారికి ఏ సర్వీసు రూల్స్ పాటించకుండా చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కరెక్టు చేయాల్సి వస్తోందన్నారు. వీరిపై ప్రజలు విసుగు చెంది అక్కడ కూర్చోబెట్టారన్నారు.  వాస్తవాలు చెప్పాలని బయటపెడుతున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో తక్కువ సీట్లు తీసుకున్నానని, ఇలాంటి సమస్యలను అడ్రస్ చేయడానికి ఉన్నానన్నారు. కోనసీమ రైతులకు తాను గొంతునవుతానని అన్నారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×