E-Paper
Advertisement

Malaysia: మలేషియా వచ్చి బుక్కయ్యాను.. కోనసీమ వ్యక్తి కష్టాలు, కాపాడాలంటూ..

Malaysia: మలేషియా వచ్చి బుక్కయ్యాను.. కోనసీమ వ్యక్తి కష్టాలు, కాపాడాలంటూ..
Advertisement

Malaysia: కూటి కోసం కోటి తిప్పులు అన్నట్లుగా.. విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రజలు చాలా కష్టాలు అను భవిస్తున్నారు. అక్కడి సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆ జాబితాలో రాంబాబు కూడా ఒకడు. మలేషియాకు వెళ్లిన అతడు.. అక్కడి కష్టాలను చెబుతూ తనను స్వదేశానికి రప్పించాలంటూ బిగ్ టీవీని ఆశ్రయించాడు.

విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ ఒక విధంగా చెప్పి, అక్కడికి వెళ్లిన తర్వాత మరో పనులు చేయిస్తున్నారు. అలాంటి జాబితాలో ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వచ్చారు. రీసెంట్‌గా గల్ప్ దేశాల్లో ఇద్దరు వ్యక్తులను తన కష్టాలను చెబుతూ ఏపీ ప్రభుత్వానికి చెప్పారు. దీంతో వారిని స్వదేశానికి రప్పించింది ఏపీ సర్కార్.

Advertisement

తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మలేసియాలో నరకయాతన అనుభవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం 2 లక్షల 50 వేలు అప్పు చేసి మలేసియాకు వచ్చాడు రాంబాబు. ఏకంగా 12 గంట లు వెట్టి చాకిరీ చేయించుకుని కేవలం పావుగంట మాత్రమే రెస్ట్ ఇస్తున్నారంటూ వాపోయాడు బాధితుడు.

ALSO READ:  ఉమ్మడి తూ.గో జిల్లాలో వరుస హత్యలు.. కారణాలివేనా ?

Advertisement

తన పరిస్థితిని మంత్రి నారాలోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బిగ్ టీవీని ఆశ్రయించాడు రాంబాబు. తనకు కనీసం సెలవు ఇవ్వలేదని, ఇండియాకి వెళ్లాలంటే మనీ కట్టాలని ఒత్తిడి చేస్తున్నాడని తన బాధను వ్యక్తం చేశాడు. దయ చేసి తనకు సహాయం చేయాలని వేడుకున్నాడు.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×