BigTV English

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు

Father and son have heart attacks in Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. మొదట తండ్రికి గుండెపోటు రావడంతో తట్టుకోలేని కొడుకు రోదనలకు అదే రోజు గుండెపోటు వచ్చింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని పెద్దంపేట గ్రామంలో జరిగింది.


వివరాల ప్రకారం.. పెద్దంపేట గ్రామానికి చెందిన బీసులు పెద్ద లస్మయ్య(62)కు సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కొడుకు కృష్ణం రాజు రోదనలు కంటతడి పెట్టించాయి. తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఇకలేరని వార్తను జీర్ణించుకోలేకపోయాడు. తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కృష్ణం రాజు మృతి చెందాడు. ఈ హృదయవిచారక ఘటనను చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు.

Alao Read: ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్, ధరణి.. ఆపై 8 లక్షలు..


లస్మయ్య చనిపోవడంతో కొడుకు కృష్ణం రాజు తల్లడిల్లిపోయాడు. ఉదయం నుంచి రోదిస్తూనే అంత్యక్రియలు చేసిన కృష్ణంరాజు సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇలా ఒకేరోజు తండ్రీకొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×