Guntur Mayor: గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రకి 34 ఓట్లు లభించగా.. వైసీపీ అభ్యర్థి వెంకట రెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమినే గెలుపు వరించింది. కార్పొరేటర్లతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే లు రామాంజనేయలు, నసీర్, గల్లా మాదవి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
నాలుగు దశాబ్దాల తరువాత గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మీద ఎట్టకేలకు టీడీపీ జెండా ఎగిరింది. దాంతో సుదీర్ఘకాలం తర్వా టీడీపీ కల నెరవేరినట్టైంది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందు నుంచి పట్టుకున్న టీడీపీకి ఇంతకాలం మేయర్ పీఠం మాత్రం అందని ద్రాక్షగానే మారింది. ఆ క్రమంలో నెల రోజులుగా మేయర్ సీటుపై కొనసాగుతున్న పొలిటికల్ హీట్ అవిశ్వాసంలో కూటమి పార్టీ గెలుపుతో ముగిసినట్లైంది.
మరోవైపు గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు.. జీవీఎంసీ పరిధిలోని 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫిషీయో సభ్యుల హోదాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. జీవీఎంసీ మేయర్‌గా 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు ఖరారయింది. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ శ్రీనివాసరావుకు బీఫాం అందజేశారు.
ఈనెల 19న వైసీపీ మేయర్ గొలగాని వెంకట కుమారిని అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించారు కూటమి కార్పొరేటర్లు. మేయర్ ఎన్నికకు వైసిపికి సంబంధం లేకపోవడంతో కొంతమంది వైసిపి కార్పొరేటర్లు హాజరవుతారని తెలుస్తోంది. మరోవైపు జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో విశాఖ మేయర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్.
Also Read: చిక్కుల్లో సజ్జల ఫ్యామిలీ.. రేపో మాపో చర్యలకు అంతా రెడీ!
శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. జీవీఎంసీలో కూటమికి 63 మంది కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్ అఫీషియోసభ్యుల బలం ఉంది. మేయర్ ఎన్నికకు జీవీఎంసీ మొత్తం సభ్యుల్లో సగం మంది మద్దతు ఉంటే సరిపోతుంది ఈ నేపథ్యంలో పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనమే అని చెప్పాలి.