BigTV English

Sajjala Family: చిక్కుల్లో సజ్జల ఫ్యామిలీ.. రేపో మాపో చర్యలకు అంతా రెడీ!

Sajjala Family: చిక్కుల్లో సజ్జల ఫ్యామిలీ.. రేపో మాపో చర్యలకు అంతా రెడీ!

Sajjala Family: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి కష్టాలు రెట్టింపు అయ్యాయి. గతంలో చేసిన పాపాలకు ఒకొక్కరుగా బుక్కవుతున్నారు. వైసీపీ పాలనలో చేసిన కబ్జాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటవీ భూముల ఆక్రమణలో సజ్జల ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గడిచిన ఐదేళ్లు దాదాపు 63 ఎకరాల అటవీ భూమిని సజ్జల కుటుంబీకులు ఆక్రమించారని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీంతో రేపో మాపో వారిపై కొరడా ఝులిపించనున్నట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.


లోగుట్టు బయటకు

వైసీపీలో చాలామంది నేతలు సజ్జల ఫ్యామిలీ చాలా నిజాయితీ ఉంటుందని చెబుతున్నారు. పైకి మాటలు ఒకలా.. లోపల మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో సులువుగా భూములు కొట్టేశారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు. దాదాపు 64 ఎకరాల అటవీ భూమి సజ్జల ఫ్యామిలీ ఆక్రమణలో ఉన్నట్లు తేల్చారు.


ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ రెండు నెలలపాటు సర్వే చేపట్టింది. ఇందులో అనేక అంశాలను వెలుగులోకి వచ్చాయి. సర్వే పూర్తి కావడంతో ప్రభుత్వానికి ఆ జిల్లా కలెక్టర్ నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఇంతకీ సజ్జల ఫ్యామిలీ కబ్జా చేసిన ఆ భూములు ఎక్కడ? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. కడప జిల్లా సీకే దిన్నె మండలం అటవీ భూముల కబ్జాకు వేదికైంది. సజ్జల ఫ్యామిలీకి చెందిన ఎస్టేట్‌లో అటవీ భూములు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. కేవలం ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేటు, డీకేటీ పట్టా భూములను కబ్జా చేసినట్లు ప్రభుత్వానికి బాధితులు ఫిర్యాదు చేశారు.

ALSO READ: టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపాలిటీ

సజ్జల ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తుల పేర్ల మీద దాదాపు 146 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 11 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో 64 ఎకరాలు కబ్జా చేసినట్టు తేల్చారు. గతంలో కడప ఫారెస్టు అధికారిగా పని చేసిన వ్యక్తిపై ఒత్తిడి తెచ్చి రాయించుకున్నట్లు అధికారుల మాట. ఇటీవల రెవెన్యూ అధికారులు సజ్జల ఎస్టేట్‌‌లో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 55 ఎకరాల అటవీ భూమి ఉందని గుర్తించారు.

బయటకు వచ్చిన కబ్జాల బాగోతం

ఈ యవ్వారంపై సజ్జల ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయింది. దీనిపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి ఓ కమిటీని వేసింది ప్రభుత్వం. ఈ కమిటీ రెండు నెలల పాటు అన్నికోణాల్లో సర్వే చేసింది.

సరిహద్దు రాళ్లను గుర్తించి, సజ్జల ఎస్టేట్ భూములకు కంచె ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. గతంలో కబ్జాకు గురైంది 55 ఎకరాలు కాగా, ఇప్పుడు మరో 64 ఎకరాలు ఆక్రమణకు గురైందని నివేదిక ఇచ్చేశారు. ఈ నివేదికపై కూటమి సర్కార్ రేపో మాపో చర్యలు చేపట్టనుంది. మొత్తానికి సజ్జల కబ్జా గుట్టు రట్టయ్యింది.

Related News

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Sunil Kumar Ahuja: ఏపీ లిక్కర్ కేసులో కొత్త కోణం.. సునీల్ అహూజాపై సిట్ కన్ను, ఇంతకీ వీళ్లెవరు?

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Big Stories

×