Mahesh Babu : మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాకుండా బీభత్సమైన యాడ్స్ లో కూడా మహేష్ బాబు నటిస్తూ కనిపిస్తారు. మహేష్ ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు మహేష్ కు అదే శాపంగా మారింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ సూరానా గ్రూప్స్ కంపెనీలు ప్రమోషన్ కోసం మహేష్ బాబు దాదాపు 6 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం వినిపించండి. ఇక ఈ కంపెనీల పై చాలా ఆరోపణలు ఉన్నాయి. దీనిలో భాగంగా మహేష్ బాబుకి 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలానే నేడు విచారణకు హాజరు కావలసిందిగా కోరారు.
విచారణకు రావడం కుదరదు
మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్న సంగతే తెలిసింది. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఒక్కరోజు షూటింగ్ కి డేట్ ఇచ్చిన తర్వాత వెళ్ళకపోతే ప్రొడ్యూసర్ తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది. చాలామంది కాస్ట్ అండ్ క్రూ ఇబ్బంది పడతారు. ఒక్కరోజు సినిమా డిలే అవటం వలన అది పెరిగి ఎక్కడికి పోతుంది. అలానే అంతమంది డేట్స్ కూడా ఒకేరోజు దొరకడం కూడా కష్టం. ఈ తరుణంలో తాను సినిమా షూటింగ్ లో ఉన్నానని, ఇప్పుడు రావడం కుదరదు అని మహేష్ బాబు లేఖ రాశాడు. కానీ, ఇప్పటి వరకు ఆ లేఖపై ఈడీ అధికారులు స్పందించలేదు.
ఈడి అధికారులు స్పందించలేదు
మామూలుగా మహేష్ బాబు ఇలా రిక్వెస్ట్ చేసిన వెంటనే ఈడీ అధికారులు తన రిక్వెస్ట్ ను మన్నించి వేరే సొల్యూషన్ చెప్పాలి. కానీ ఇప్పటివరకు ఈడి అధికారులు స్పందించలేదు. విచారణకు రావడానికి మహేష్ కు మరో తేదీ ఇస్తారా..? లేదా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారా.?? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఒకవేళ అరెస్టు వారిని జారీ చేస్తే అది ఇంకా పెద్ద రచ్చ అయిపోతుంది. అయితే మహేష్ బాబు తీసుకున్న ఆరు కోట్లు కూడా దాదాపు మూడు కోట్ల వరకు చెక్ రూపంలో ఇచ్చారని. ఇంకో రెండు కోట్లు నగదుగా ఇచ్చారని తెలుస్తుంది. అయితే దీనిపై మరింత క్లారిటీ త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Siddhu Jonnalagadda: తెలుసు కదా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా.?