Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన పాన్ ఇండియా మూవీ ‘కంగువా’ (Kanguva). నవంబర్ 14 న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, దారుణంగా నిరాశపరచడంతో ఊహించని రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. అయితే “కంగువా” మూవీ రిలీజ్ కి ముందు మేకర్స్ ఈ సినిమా రికార్డులను తిరగ రాస్తుంది అంటూ చేసిన కామెంట్స్ ను మళ్లీ గుర్తు చేస్తున్నారు. తాజాగా థియేటర్లలో ‘కంగువా’ సినిమా థియేటర్లలో సూర్య నేమ్ కార్డ్ ఛేంజ్ అవ్వడంతో మరోసారి ట్రోలింగ్ జోరందుకుంది. సినిమాకన్నా టైటిల్ కార్డు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా సినిమా మొదట్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలో హీరో పేరుని కూడా అదే రేంజ్ ఎలివేషన్ తో స్క్రీన్ మీద వేస్తారు. అయితే తాజాగా “కంగువా” (Kanguva) స్క్రీన్ లలో కూడా ఇలాగే హీరో సూర్య పేరుని వేశారు. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి ఆయన నటించిన సినిమాలన్నింటినీ జోడించి దాదాపు 20 సెకండ్ల టైటిల్ కార్డ్ ని క్రియేట్ చేశారు. దానికి అవెంజర్స్ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ సూర్య పేరుని తెరపై వేశారు.
దీంతో ఇదంతా చూసిన ప్రేక్షకులు థియేటర్లలోనే వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెడుతూ, “కంగువా” (Kanguva) రికార్డులు మార్చలేదు కానీ సూర్య నేమ్ టైటిల్ కార్డు ఛేంజ్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మూవీ 1000 నుంచి 2000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ మూవీ రిలీజ్ కి ముందే నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకొని థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు.. బయటకు వచ్చేటప్పుడు, చెవులు చిల్లులు పడే సౌండ్ పొల్యూషన్ వల్ల వచ్చిన తలనొప్పితో బయటకు పరుగులు పెట్టారు. దీంతో మొదటి రోజే మూవీ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది.
ఈ నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ మూవీ కలెక్షన్స్ పై స్ట్రాంగ్ గానే పడింది. నిజానికి ఈ మూవీ ఇప్పటిదాకా తమిళ చిత్ర సీమ టచ్ చేయని 1000 కోట్ల రికార్డును బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. కానీ నెగెటివ్ టాక్ ఫలితంగా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ‘కంగువా’ (Kanguva) మూవీ కేవలం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే తీవ్ర విమర్శల నేపథ్యంలో మూవీ మ్యూజిక్ విషయంలో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు మేకర్స్. మరి ఇప్పటికైనా ఈ మూవీకి ఆక్యుపెన్సీ పెరుగుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఇప్పుడు పోటీలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. “కంగువా” (Kanguva)కు పోటీగా రిలీజ్ అయిన వరుణ్ తేజ్ “మట్కా” కూడా నెగిటివ్ టాక్ తో చతికిలబడింది. మరి ఇలాంటి మంచి టైంని “కంగువా” ఉపయోగించుకుంటుందా అంటే అనుమానమే. కానీ అద్భుతమైన నటుడు అయినప్పటికీ సూర్య మొదటి పాన్ ఇండియా ప్రయత్నం ఇలా బెడిసి కొట్టడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది.