Galaxy S25 Edge Price Drop: తక్కువ ధరలో మంచి శాంసంగ్ ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో చూస్తున్నారా? అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఆఫర్ మీ ప్లాన్‌ను మార్చేయొచ్చు. ఎందుకంటే.. Galaxy S25 Edge లాంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డీల్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఇలాంటి ఫోన్లపై పెద్దగా తగ్గింపు కనిపించదు. కానీ ఈసారి మాత్రం లెక్క కాస్త భిన్నంగా ఉంది. ఇంతకీ ఈ ఫోన్ ఎంతకు దొరుకుతోంది? ఈ ఆఫర్‌లో ఎంత ఆదా చేయొచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.
Galaxy S25 Edge 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.1,09,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఏకంగా 41 శాతం తగ్గింపు ఇస్తోంది. అంటే దాదాపు రూ.45,000 డిస్కౌంట్‌తో కేవలం రూ.64,999లకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. టైటానియం జెట్‌బ్లాక్ కలర్ వేరియంట్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే 512GB వేరియంట్‌పై కూడా 37 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర ప్రస్తుతం రూ.76,999గా ఉంది.
Also Read: Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!
కేవలం ఫ్లాట్ డిస్కౌంటే కాకుండా అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2,225 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ.62,774కు తగ్గుతుంది. అంతేకాకుండా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,750 వరకు క్యాష్‌బ్యాక్, ప్రత్యేక గిఫ్ట్ వోచర్లు కూడా పొందే అవకాశం ఉంది. రూ.30,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నప్పటికీ.. ఇది పిన్‌కోడ్‌ను బట్టి మారుతుంది.
ఈ Samsung Galaxy S25 Edge ఫోన్ 6.657 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో అత్యంత వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. వెనుక వైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి.
ఇక సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 3,900mAh బ్యాటరీతో వచ్చే ఈ 5G ఫోన్, పెర్ఫార్మెన్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే ఆఫర్ ముగిసేలోపు, మీ ఏరియా పిన్‌కోడ్‌కు డెలివరీ ఉందో లేదో చెక్ చేసుకుని వెంటనే ఆర్డర్ చేయడం మంచిది.
Also Read: ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!