E-Paper
Advertisement

అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!

అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!
Advertisement

Illegal Checkpost: అనకాపల్లి మండల కేంద్రంలో ఏఎంఆర్ సంస్థ మైనింగ్ చెక్ పోస్ట్‌ల పేరుతో మాటూరు జంక్షన్‌ వద్ద అక్రమ చెక్‌పోస్టు ఏర్పాటు చేసి లారీలు, ట్రక్కుల డ్రైవర్ల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తున్నారని ఏబీ వెంకటేశ్వర్లు ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. అక్రమ రిజిస్టర్లు, స్టాంప్‌ ప్యాడ్లు ఏర్పాటు చేసుకుని రోజువారీగా దర్జాగా వసూళ్లు చేస్తున్నారని అన్నారు.

అక్రమ వసూళ్లు..

డబ్బులు చెల్లించకుండా వెళ్లే లారీలను మోటార్‌సైకిళ్లు, బొలేరో వాహనాలతో వెంబడించి అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని డ్రైవర్లు వాపోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సీనరేజ్‌ కలెక్షన్‌ పేరుతో ఇలాంటి వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ రిజిస్టర్లు, స్టాంపులు చెక్‌పోస్టు వద్దకు తాము వెళ్లిన సమయంలో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారని, అక్కడ లభించిన అక్రమ రిజిస్టర్లు, స్టాంప్‌ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Advertisement

Also read: నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

వాటిని అనకాపల్లి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌‌కు ఫిర్యాదుతో పాటు అప్పగించినట్లు చెప్పారు. దీనిపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు భయపడకుండా అక్రమ వసూళ్లను ఎదిరించాలని, బాధితులకు ప్రజాసంఘాలు అండగా నిలవాలని కోరారు. పాలక, ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆయన విమర్శలు చేశారు.

Advertisement

Also read: ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్ రావు ఫైర్!

Tags

Related News

ఏపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అంతర్మథనం.. ఆందోళనలో కమళ నాథులు!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ జనసేనలో అందరి కీలక పదవులన్నీ రద్దు!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీతో కియా కార్పొరేషన్ భారీ ఒప్పందం.. రూ.19 వేల కోట్లతో మరో కొత్త ప్లాంట్ అక్కడే..?

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు.. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్!

విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటనపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బ్రేకింగ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!

24 గంటల్లో ఏపీకి మరో భారీ తుఫాన్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

Big Stories

Advertisement
×