E-Paper
Advertisement

కావలి జనసేనలో పాత-కొత్త నేతల ఆధిపత్య పోరు.. సుకుమార్ రెడ్డి చేరికపై రగులుతున్న అసంతృప్తి!

కావలి జనసేనలో పాత-కొత్త నేతల ఆధిపత్య పోరు.. సుకుమార్ రెడ్డి చేరికపై రగులుతున్న అసంతృప్తి!
Advertisement

Jana Sena: పార్టీ బలోపేతానికి జనసేన అధినేత పవన్.. వైసీపీలోని అసంతృప్తి నేతలను చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సుకుమార్ రెడ్డికి కండువా కప్పి ఆహ్వానించారు. కానీ, ఆయన చేరికను జిల్లాలోని కొందరు జనసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఐదేళ్లపాటు వైసీపీ కేసులను ఎదుర్కొని, వేధింపులను తట్టుకొని నిలబడితే.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నేత సిద్దూ. జనసేన కోసం ఆవిర్భావం నుంచి నిలబడితే చివరికి తమకు దక్కేది ఇదేనా అని ప్రెస్ మీట్ పెట్టి మరీ అసంతృప్తి వ్యక్తం చేయడం నెల్లూరు జిల్లాలో హాట్ డిస్కషన్ కి దారి తీసింది.

ఈ మాత్రం సిద్దూకి తెలియదా?

Advertisement

కొత్తవారిని చేర్చుకోకుండా పార్టీ ఎలా బలపడుతుంది? ఈ మాత్రం సిద్దూకి తెలియదా? అనే ప్రశ్న దగ్గరే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనసేనలో చేరినప్పటి నుంచి సుకుమార్ రెడ్డి, ఆయన వర్గం బాగా యాక్టివ్ అయ్యారు. జనసేన కావలి బాధ్యతలు ఆయనకు ఇవ్వాలనే కోర్కెలు అభిమానుల నుంచి అధిష్టానానికి చేరాయట. ఈ కోర్కెలు సిద్దూ వర్గాన్ని కలవరపెడుతున్నాయి. ఇది చేరికల వ్యవహారం మాత్రమే కాదని.. జనసేన కావలి భవిష్యత్ నాయకత్వాన్నే మార్చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

సుకుమార్ రెడ్డి చేరికపై మరో ఇంట్రస్టింగ్ అంశం..

Advertisement

సుకుమార్ రెడ్డి చేరికపై మరో ఇంట్రస్టింగ్ అంశం కూడా తెరపైకి వస్తోంది. కావలిలో గతంలో జరిగిన అక్రమ లే అవుట్ల వ్యవహారంలో ఆయనపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన పార్టీ మారారనే ఆరోపణలు కూడా చేస్తున్నవారు ఉన్నారు. అయితే, పాత జనసేన నేతలంతా సుకుమార్ రెడ్డి చేరికను వ్యతిరేకించడం లేదు.. ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

రెండు వర్గాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు..?

మొత్తానికి జనసేనలో పాత, కొత్త నేతలను పవన్ కల్యాణ్ ఎలా సంతృప్తి పరుస్తారు? రెండు వర్గాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది చూడాలి.

Also Read: ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

Tags

Related News

ఏపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అంతర్మథనం.. ఆందోళనలో కమళ నాథులు!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ జనసేనలో అందరి కీలక పదవులన్నీ రద్దు!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీతో కియా కార్పొరేషన్ భారీ ఒప్పందం.. రూ.19 వేల కోట్లతో మరో కొత్త ప్లాంట్ అక్కడే..?

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు.. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్!

విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటనపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బ్రేకింగ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!

24 గంటల్లో ఏపీకి మరో భారీ తుఫాన్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

Big Stories

Advertisement
×