Chandrababu Trips: చంద్రబాబు రహస్య పర్యటనలు ఎందుకోసం చేస్తున్నారో అన్నీ మాకు తెలుసని లక్ష్మీ పార్వతి అన్నారు. సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా రకరకాల సమస్యలతో ఉంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు ఎవరి కోసం చేస్తున్నారన దోచుకున్న సంపదను చంద్రబాబు దేశం దాటిస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ టూర్ పేరుతో వెళ్లి దేశవిదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు.
ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు. గతంలో జగన్ తన పిల్లల దగ్గరకు వెళ్తే చంద్రబాబు, లోకేష్ పచ్చిగా మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి తండ్రీ కొడుకులు ఇప్పుడు ఏ దేశంలో దాక్కున్నారని ఫైర్ అయ్యారు. జనానికి తెలియకుండా అంత రహస్యంగా ఎందుకు పర్యటిస్తున్నారని అన్నారు. వారిద్దరూ ఏపీలోనే ఉన్నట్టుగా ఎల్లోమీడియా భజన చేస్తోందని తెలిపారు. ఈ ఎల్లోమీడియా వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతోంది. రాష్ట్రంలో పచ్చమంద ఇసుక, మట్టి, కొండలు ఏదీ మిగలకుండా దోచుకుంటోందని దయ్యబడ్డారు.
Also read: వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !
చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ రహస్య టూర్లకు వెళ్తున్నారని, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుపై నిఘా పెట్టాలని అన్నారు. ఆయన ఏ దేశానికి ఎంత సంపద తరలిస్తున్నారో లెక్క తేల్చాలని, సీఎం హోదాలో వెళ్తే చెకింగ్ ఉండదని విమానాల్లో సంపదను తరలిస్తున్నారని అన్నారు. లక్షల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటావ్ చంద్రబాబూ? రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల బాధలు తెలుసుకోండని అన్నారు.
Also read: రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!