Shoaib Akhtar On IND VS PAK: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా పై గెలవడం కష్టమేనని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే షోయబ్ అక్తర్ మాత్రం చాలా భిన్నంగా స్పందించారు. టీమిండియాను చూసి పాకిస్తాన్ అనవసరంగా భయపడుతోందని ఫైర్ అయ్యారు. టీమిండియాను ఏషియన్ గేమ్స్ లో ఓడించడం చాలా సులువు.. ఈ విషయం తెలియక పాకిస్తాన్ ప్లేయర్లు భయపడిపోతున్నారని చురకలు అంటించారు షోయబ్ అక్తర్. టైం చూసి టీమ్ ఇండియాను దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. తాను పాకిస్తాన్ హెడ్ కోచ్ అయి ఉంటే… బాబర్ ఆజం ఒక్కడితోనే టీమిండియాను చిత్తుచిత్తుగా ఓడించే వాడిని అని సవాల్ విసిరారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను చూసి అనవసరంగా పాకిస్తాన్ భయపడుతోందని మండిపడ్డారు. అందరూ అనుకున్నట్టుగా టీమిండియా అత్యంత బలమైన జట్టేమీ కాదని వ్యాఖ్యానించారు. ఓడించలేనంత గొప్ప టీం కాదని పరువు తీశారు. టీమిండియాను సులభంగానే ఓడించవచ్చని తెలిపారు.
తాను పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ అయి ఉంటే మాత్రం బాబర్ ఒక్కడితోనే టీమిండియాను ఓడించే వాడినని శపథం చేశారు. బాబర్ లాంటి కీలక ఆటగాడిని అసలు పాకిస్తాన్ జట్టులో నుంచి తీసేయకపోయే వాడిని తెలిపారు. మహమ్మద్ రిజ్వాన్ అలాగే బాబర్ ఇద్దరినీ కలిపి అస్సలు ఆడించకూడదని సూచనలు చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఆడితే పాకిస్తాన్ రన్ రేట్ పడిపోతుందని బాంబు పేల్చారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రద్దు కావాలని బాసిత్ ఆలీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాతో తలపడితే పాకిస్తాన్ ఓడిపోతుందని వెల్లడించారు. అదే ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే.. గోల్డ్ మెడల్ ను ఇండియా అలాగే పాకిస్తాన్ పంచుకోవచ్చని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏషియన్ గేమ్స్ రూల్స్ ప్రకారం క్వార్టర్ ఫైనల్స్ లో వర్షం పడితే… ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉన్న జట్టును ముందుకు పంపిస్తారు. అదే ఫైనల్స్ లో మాత్రం వర్షం పడితే 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే ఇద్దరినీ విజేతలుగా ప్రకటించనున్నారు.