BigTV English

Tirumala Chirutha Attack: తిరుపతిలో ద్విచక్ర వాహన దారుడిపై చిరుత దాడి.. భయం గుప్పిట్లో భక్తులు

Tirumala Chirutha Attack: తిరుపతిలో ద్విచక్ర వాహన దారుడిపై చిరుత దాడి.. భయం గుప్పిట్లో భక్తులు

Tirumala Chirutha Attack: తిరుపతి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అలిపిరి జూ పార్క్ రోడ్డులో జరిగిన ఒక ఘటనలో, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తిపై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనను వెనుక వస్తున్న కారులోని ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేశారు, దీంతో ఈ విడీయో వైరల్‌గా మారింది.


చిరుత సంచారం.. భయాందోళనలను భక్తులు
అయితే అదే రోజు అర్ధరాత్రి సమయంలో, అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో కూడా చిరుత సంచరిస్తూ స్థానికులకు కనిపించింది. ఈ ప్రాంతంలో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయని, ముఖ్యంగా జూ పార్క్ రోడ్డు, కల్వర్టుల సమీపంలో రాత్రి సమయాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలు భక్తులు, స్థానికులలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ రోడ్డుపై ప్రయాణించే వారిలో ఆందోళన పెరిగింది.

ప్రయాణికులకు అధికారులు హెచ్చరిక..
అలాగే ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపి ప్రయాణికులు సమయం గడపడం సర్వసాధారణం. కానీ, ఇలా చేస్తే ఈ చిరుత సంచారం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా తిరుమల, అలిపిరి ప్రాంతాల్లో చిరుతలు కనిపించిన సంఘటనలు నమోదయ్యాయి.. అంతేకాకుండా ఒక ఘటనలో ఆరేళ్ల చిన్నారి కూడా మృతిచెందింది.


Also Read: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు..

ఒంటరిగా వెళ్లకూడదంటోన్న అధికారులు..
టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సుమారు 500 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, చిరుతల కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ, ఇనుప కంచెలను దాటుకుని చిరుతలు రోడ్లపైకి రావడం కొనసాగుతోంది. భక్తులు గుండెల్లో దడ పుట్టించే ఈ ఘటనల నేపథ్యంలో, రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించకుండా, గుంపులుగా రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×