BigTV English

Vizag : స్కూల్‌ పిల్లల ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆటో మూడు పల్టీలు..

Vizag : స్కూల్‌ పిల్లల ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆటో మూడు పల్టీలు..

Vizag : విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్నఆటోను.. వెనుకే వస్తున్న లారీ అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా 3 పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.


రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు, స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మధురవాడ-నగరం పాలెం రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో.. ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరంపాలెం వైపుగా విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది విద్యార్థులుండగా .. అందరూ స్వల్పంగా గాయపడ్డారు.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×