BigTV English

Divyavani : టీడీపీకి బై బై.. హస్తం గూటికి బాపుబొమ్మ దివ్యవాణి

Divyavani : టీడీపీకి బై బై.. హస్తం గూటికి బాపుబొమ్మ దివ్యవాణి

Divyavani : ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు దివ్యవాణి చౌదరి హస్తం గూటికి చేరారు. ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో దివ్యవాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా.. దివ్యవాణి టీడీపీలో చాలాకాలం పాటు తన సేవలు అందించారు. 2022లో టీడీపీకి రాజీనామా చేసిన ఆమె.. ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. తాజాగా తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా.. ప్రధాన పోటీ బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండటంతో.. ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని.. హస్తం తీర్థం పుచ్చుకున్నారు.


కాగా.. సినీ నటీనటులు రాజకీయాల్లోకి రావడం పరిపాటిగా మారింది. దివ్యవాణి ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచిపేరున్న హీరోయిన్ గా ఉన్నారు. దివంగత దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపుస్తకం సినిమాతో ఆమెకు నటిగా మంచిపేరొచ్చింది. తొలి సినిమా నుంచే దివ్యవాణికి బాపుబొమ్మ అనే పేరుంది. ఆ తర్వాత ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, సంసారాల మెకానిక్, పెళ్లికొడుకు వంటి సినిమాల్లో నటించారు.

.


.

.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×