E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడన్న దీప   

Karthika Deepam 2 Serial Today Episode August 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడన్న దీప   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఆఫీసులో కూర్చున్న దీప. జ్యోత్స్న ఇంట్లో చెప్పిన పెళ్లి విషయం గుర్తు చేసుకుని మళ్లీ జ్యోత్స్ను పిలుస్తుంది. జ్యోత్స్న వచ్చి చెప్పండి మేడం అని అడుగుతుంది. దీంతో దీప.. జీవితంలో పెళ్లి చేసుకోకూడదన్న పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడిగితే.. పెళ్లి మీద విరక్తి కలిగిందని జ్యోత్స్న చెబితే అబద్దం నువ్వు చెప్పేది అబద్దం సూరజ్‌ నిన్ను రిజెక్ట్‌ చేశాడన్న బాధతో ఈ నిర్ణయం తీసుకున్నావు.. నాకు తెలిసి నువ్వు జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ చూడలేదు.. నిజం ఏంటంటే.. సూరజ్‌ కు నువ్వుంటే చాలా ఇష్టం.. నిన్ను నిన్నులా ప్రేమిస్తున్నాడు. పంతానికి పోయి సూరజ్‌ను దూరం చేసుకోకు.. జీవితం ఎప్పుడూ ఇలాగే ఉండదు.. అంటూ దీప చెప్తుంటే..

అదేం కాదు జీవితంలో విరక్తితోనే ఇలా చేశానని చెప్తుంది జ్యోత్స్న. కానీ దీప మాత్రం నీకు కూడా సూరజ్‌ అంటే చాలా ఇష్టం అని చెప్పగానే.. నేను చెప్పానా..? అని జ్యోత్స్న అడిగితే.. నువ్వు మాటల్లో చెప్పలేకపోయినా నీ గుండెల్లో ఉన్న ప్రేమ నీ కన్నీళ్ల రూపంలో కనిపిస్తుంది ఆలోచించుకో జ్యోత్స్న.. సూరజ్‌ను వదిలేసుకోకు.. అంటూ దీప చెప్తుండగానే.. అప్పుడే కార్తక్‌, సూరజ్‌ వస్తారు. సూరజ్‌ ఏంటి వదిన ఈ మధ్య కొందు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారట.. అని అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా దీప నేను వెళ్తాను అంటూ సూరజ్‌ను తోసేస్తూ వెళ్లిపోతుంది.

Advertisement

జీవితంలో పెళ్లే చేసుకోను అనే నిర్ణయం ఎందుకు తీసుకుంది బ్రదర్‌ అని సూరజ్‌ అడిగితే నువ్వే వెళ్లి అడగాలి అని కార్తీక్‌ చెప్తాడు. సూరజ్‌ మాత్రం ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న నాటకం అని చెప్తుంటే.. అప్పుడే లోపలికి వచ్చిన జ్యోత్స్న కోపంగా కొట్టబోతూ.. ఆగి ఎవరిదిరా నాటకం నా మనసులో ఉన్నది ఎలా తెలుస్తుంది. అంటూ ప్రశ్నిస్తుంది. సూరజ్‌ మాత్రం నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నీ మీద ఉన్న నా ఇష్టం మారదు కదా..? నాకు నచ్చిన వాళ్ల కోసం నేను మాట్లాడతాను అంటూ సూరజ్‌ వెళ్లిపోతాడు. జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది.

కార్తీక్‌, దీప దగ్గరకు వెళ్లి అయ్యబాబోయ్‌ ఈ బాధ భరించలేను.. వాళ్లిద్దరూ కొట్టుకునేలా ఉన్నారు.. అంటూ జరిగింది అంతా దీపతో చెప్తూ కార్తీక్‌ నవ్వుకుంటాడు. దీంతో దీప జ్యోత్స్న మనసు నాకు అర్థం అయింది. సూరజ్‌ ను తప్ప ఇంకెవరిని తాను పెళ్లి చేసుకోలేనని తన ఉద్దేశం అందుకే జ్యోత్స్న వదిలేసింది కన్నీళ్లు కాదు నిన్ను అంటూ దీప చెప్పగానే.. కార్తీక్‌ నమ్మడు.. అదెలా జరుగుతుంది అంటూ అడుగుతాడు. దీంతో దీప నాతో జ్యోత్స్న మాట్లాడుతున్నప్పుడు తన కన్నీళ్ల రూపంలో నిన్ను మనసులోంచి గెంటేసింది అని దీప చెప్పగానే..ఇన్నాళ్ల ప్రేమను అంత సడెన్‌గా ఎలా మర్చిపోయిందా..? అని కార్తీక్‌ డౌటుగా అడగ్గానే.. నువ్వింకేం ప్రశ్నలు అడగకు బావ.. జ్యోత్స్నలో మార్పు మొదలైంది. వాళ్లిద్దరి ఒకరినొకరు చూసుకోవడానికే ఆఫీసుకు వస్తున్నారు. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు అని చెప్తుంది.

Advertisement

ఆఫీసులో ఎదురెదురుగా కూర్చుని ఉంటారు సూరజ్‌, జ్యోత్స్న. సూరజ్‌ జ్యోత్స్ననే చూస్తుంటాడు. జ్యోత్స్న కోపంగా వెళ్లి సూరజ్‌ను తిడుతుంది. అయినా సూరజ్‌ తన మాటలతో జ్యోత్స్నను తికమకపెడతాడు. దూరం నుంచి చూస్తున్న కార్తీక్ నువ్వు చెప్పింది నిజమే దీప అంటాడు.. అవును బావ ఇలా కొట్టుకుని కొట్టుకుని వాళ్లిద్దరూ ఒక్కటైపోతారు బావ అంటుంది.  తర్వాత రాత్రికి జ్యోత్స్న లగేజీ తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతుంటే.. సూరజ్‌ ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళితే నీకెందుకురా అంటూ తిట్టినట్టు చెప్తుంది జ్యోత్స్న. సూరజ్‌ అడ్డుపడినా ఆగకుండా జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×