BigTV English

Maddali Giri: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దాళి రాజీనామా

Maddali Giri: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దాళి రాజీనామా

Maddali Giri YSRCP Resigned: వైసీపీకి మరో బిగ్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ పదవితోపాటు క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు పంపుతూ ఆమోదించాలని కోరారు.


అయితే వ్యక్తిగత కారణాలతోనే గుంటూరు వైసీపీ అధ్యక్ష పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మద్దాలి గిరి స్పష్టం చేశారు. కాగా, ఆయన గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా మద్దాలి గిరి కొనసాగుతు వచ్చిన సంగతి తెలిసిందే.

మద్దాళి గిరిధరరావు..2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే ఏడాది వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన వైసీపలోనే కొనసాగుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఈ స్థానాన్ని విడదల రజినికి కేటాయించింది. దీంతో గిరిధర రావును శాంతింపజేసేందుకు వైసీపీ అధిష్టానం ఆయనకు పార్టీ నగర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.


Also Read: ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ఇక నుంచి..

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సైతం గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా, వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవితోపాటు వైసీపీ క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×