Tirumala Reels: YSRCP ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.. అయితే తిరుమల కొండకు వచ్చన దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఫోటోలు దిగారు. ఫోటో షూట్‌లు కూడా చేశారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఎక్కడికి వెళ్లిన రిల్స్ తియడం అలవాటుగ మారిన దివ్వెల మాధురికి తిరుమలలో కూడా రిల్స్ చేసి ఇన్‌స్టాలో ఫోస్ట్ చేసింది. దీంతో ఆమె తీసిన రిల్స్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది.
గతంలో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో మాధురి రిల్స్ చేయడం వివాదం అయ్యింది. భక్తుల మనోబావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శలు రావడంతో నాడు టీటీడీ నోటిసులు కూడా దువ్వాడ శ్రీనివాస్‌కు జారి చేసింది. అప్పుడ దివ్వెల మాకు తెలియక చేశాము మమ్మల్ని క్షమించండి అని టీటీడీ వారిని కోరారు.
ఎంతో పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం దగ్గర ఫోటో షూట్ చేసినట్లు దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పవిత్రమైన ఏడుకొండలవారి పుణ్యస్థలంలలో రిల్స్ చేయడం, పోటో షూట్ చేయడంపై టీటీడి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దివ్యెలపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే గత సోమవారం దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వీఐపీ బ్రెక్ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పవిత్రమైన పుష్కరిణి దగ్గర మాధురి పోటో షూట్ చేసింది. ఈ క్రమంలో వారు పెళ్లిపై సంచలన ప్రకటన చేశారు. వారిపై ప్రస్తుతం కోర్లో కొన్ని కేసులు ఉన్నాయి. అవి అయిపోయాక మేము పెళ్లి చేసుకుంటాం అని దువ్వాడ శ్రీనివాస్ ప్రటించారు. వీరిద్దరు గత రెండు సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. కానీ పెళ్లిపై మాత్రం ఇప్పుడే క్లారీటి ఇచ్చారు.
అసలు గతంలో చేసిన తప్పును మళ్లీ ఎందుకు చేశారు అని చాలా మంది ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు పెట్టిన కేసు ఇంకా కోట్టోనే నడుస్తుంది. మళ్లీ ఇప్పుడు అది అవ్వక ముందే రిల్స్ చేయడంపై భక్తులు ఆమెపై మండిపడుతున్నారు. తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలు చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం సిరియస్‌గా రియాక్ట్ అవుతుందని చెబుతున్నారు.
Also Read: మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే?
ఇదిలా ఉంటే.. గతంలో దివ్వెలా మాధురిలాగా రిల్స్ పిచ్చి ఉన్న ఒక అమ్మాయి క్లైమెట్ బాగుందని కిస్సిక్ సాంగ్‌కి రిల్స్ చేయడం పై భక్తులు మండిపడ్డారు. తర్వాత ఆమెపై కేసులు కూడా నమోదు చేశారు. కొన్నిరోజుల తర్వాత ఆమె కూడా నన్ను క్షమించండి అని మరో రిల్ చేసి పోస్ చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన తిరుమలలో ఇలాంటి పనులు చేయడం మాత్రం ఆపడం లేదు ప్రజలు.. పోలీసులు ప్రస్తుతం దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు.. కానీ, ఆమె అందుబాటులో లేదని చెబుతున్నారు.