BigTV English

Ajith: సినిమాలకు హీరో బ్రేక్.. ఎందుకంటే.. ?

Ajith: సినిమాలకు హీరో బ్రేక్.. ఎందుకంటే.. ?

Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా.. ? అంటే.. నిజమే అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అజిత్ కు ఇలా బ్రేక్ తీసుకోవడం కొత్తేమి కాదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజిత్.. ఒక ఆరునెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడట. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆరునెలలు కుటుంబంతో కలిసి ప్రపంచం మొత్తం తిరగనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారట.


ఇక ఈ ఆరునెలల్లో బైక్ టూర్ కూడా  ప్లాన్ చేసినట్లు సమాచారం. అజిత్ మంచి రైడర్ అన్న విషయం  తెలిసిందే. ఇప్పటికే  గతేడాది అజిత్ బైక్ తీసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టివచ్చాడు. ఇప్పుడు సింగిల్ గా కాకుండా కుటుంబంతో సహా వెళ్లనున్నాడట.  ప్రస్తుతం అజిత్ చేతిలో విడామయుర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు ఉన్నాయి.

ఇక ఈ రెండు సినిమాలను ఫినిష్ చేసి.. బ్రేక్ తీసుకోనున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ రెండు సినిమాలపైన అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. అది కాకా.. అజిత్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా విజయాలను కూడా రాబట్టలేదు. దీంతో అందరి చూపు వీటిమీదనే ఉంది.


ఇక ఈ రెండు సినిమాలు కాకుండా ఈ మధ్యనే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అజిత్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. వెకేషన్ తరువాతనే అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×