E-Paper
Advertisement

Thomas Matthew Crooks: ట్రంప్‌పై దాడి కేసు.. నిందితుడు 20 ఏళ్ల థామస్‌గా గుర్తింపు.?

Thomas Matthew Crooks: ట్రంప్‌పై దాడి కేసు.. నిందితుడు 20 ఏళ్ల థామస్‌గా గుర్తింపు.?
Advertisement

Thomas Matthew Crooks: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడ్ని ఎఫ్‌బీఐ గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్‌ పార్క్‌ చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా అధికారులు గుర్తించారు.

కాల్పులకు నిందితుడు ఉపయోగంచిన తుపాకీ ఏఆర్-15గా గుర్తించారు సీక్రెట్ సర్వీసు పోలీసులు. సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో 182 మీటర్ల దూరం నుంచి కాల్చినట్టు నిర్ధారించాయి. సభా వేదికకు ఎదురుగా ఉండే బిల్డింగ్ పైనుంచి మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడని గుర్తించిన పోలీసులు, ఒక బుల్లెట్ మాత్రమే ట్రంప్ చెవిని గాయపరిచిందన్నారు.

Advertisement

ఇంతకీ థామస్ మ్యాథ్యూ క్రూక్స్ ఎవరు? కుటుంబ నేపథ్యం ఏంటి? ట్రంప్‌పై ఎందుకు కాల్పులు జరిపా డు అనేదానిపై వివరాలు తెలుసుకునే పనిలోపడ్డారు. క్రూక్స్ మృతిచెందిన ప్రాంతంలో ఎలాంటి ఆధారా లు లభ్యం కాలేదు. ఎఫ్‌బీఐ అధికారులు స్థానిక అధికారులతో కలిసి విచారణ మొదలుపెట్టారు.

Also Read: పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పులు, పలుచోట్ల గాయాలు, ఎవరి పని?

Advertisement

ఘటన తర్వాత ఫోన్ రావడంతో వెంటనే రంగంలోకి దిగామన్నారు పెన్సిల్వేనియా స్టేట్ పోలీసులు. ఒక షూటర్‌ని గుర్తించామని, దీనిపై విచారణ కంటిన్యూ అవుతుందన్నారు. నిందితుడు ఒకడే ఉన్నాడా, మరెవరైనా ఉన్నారా అనేది నిర్థారించడానికి కొంత సమయం పడుతుందన్నారు.

మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ భద్రతపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధ్యక్షుడి కంటే మాజీకి భద్రత తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి అదనపు భద్రత కావాలని ట్రంప్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజమెంతో తెలీదు.

Also Read: Thomas Matthew Crooks| ‘ఒంటరిగా ఉండేవాడు.. అందరూ అతడిని ఏడ్పించేవారు’.. ట్రంప్ షూటర్ స్నేహితులు

అమెరికాలో అధ్యక్షులు, కీలక నేతలపై కాల్పులు చాన్నాళ్లుగా కొనసాగుతోంది. వీరిలో పలువురు మరణించ గా, మరికొందరు గాయాలతో బయటపడ్డారు. 1865లో అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌పై ఓ థియేటర్‌లో దుండగులు కాల్చిచంపారు. 1901లో మెక్ కిన్లీ, 1933లో ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, 1963లో జాన్ ఎఫ్ కెనడీ, 1968లో రాబర్ట్ కెనడీ, 1972లో జార్జివాలెస్, 1975లో గెరాల్డ్ ఫోర్డ్, 1981లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, 2005లో జార్జ్ డబ్య్లూ బుష్ వంటి నేతలున్నారు.

https://twitter.com/pmcafrica/status/1812359507298648359

https://twitter.com/daniel86cricket/status/1812273573857460687

Related News

అమెరికాలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి!

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×