BigTV English

PM Modi coffee with CM Chandrababu: మన్ కీ బాత్‌.. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ..

PM Modi coffee with CM Chandrababu: మన్ కీ బాత్‌.. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ..

PM Modi coffee with CM Chandrababu: దేశంలో కొత్తకొత్త విషయాల గురించి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తారు ప్రధాని నరేంద్రమోదీ. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాడుతూ అక్కడి విశేషాల గురించి ప్రధానంగా ప్రస్తావించారాయన. దేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉందని గుర్తుచేశారు. అటువంటి వాటిలో అరకు కాఫీ ఒకటని గుర్తు చేశారాయన.


ప్రతీనెల మన్ కీ బాత్ ద్వారా కొత్త విషయాలు బయటపెడతారు ప్రధాని నరేంద్రమోదీ. ఈసారి ఏపీలో అరకు కాఫీ గురించి కొన్ని విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు. దేశానికి చెందిన చాలా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మాంచి డిమాండ్‌ ఉందని గుర్తు చేశారు. అందులో అరకు కాఫీ ఉత్పత్తి ఒకటని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఒకసారి విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో అరకు కాఫీ రుచి చూసే అవకాశం తనకు లభించిందన్నారు.

అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా చాలా అవార్డులు వచ్చాయన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో జరిగిన జీ 20 సమ్మిత్‌లో కూడా అరకు కాఫీ ప్రాచుర్యం పొందిందని గుర్తుచేశారు. ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో దాదాపు లక్షన్నర ట్రైబల్ ఫ్యామిలీలు అరకు కాఫీ సాగుతో ముడిపడి ఉందని గుర్తుచేశారు. అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం అక్కడి వాతావరణమే కారణమని యూనివర్సిటీ ప్రొఫెసర్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.


సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల సాగుకు అనువైన ప్రదేశం కూడా. కాఫీ చెట్ల మధ్య పొడవైన సిల్వర్ ఓక్ చెట్ల మధ్య సాగవుతాయి. సూర్యకిరణాలు కాఫీ మొక్కలపై నేరుగా పడవు. చల్లదనం వల్ల కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండడంతో అక్కడి నేలలో క్షారగుణం తక్కువగా ఉంటుంది. ఫలితంగా కాఫీకి ప్రత్యేక రుచి తోడవుతుంది.

ALSO READ: పోలవరానికి అంతర్జాతీయ నిఫుణులు రాక, నాలుగు రోజులు ఇక్కడే

120 ఏళ్ల వెనక్కి వెళ్తే.. 1898లో ఏపీలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో బ్రిటీషర్లు కాఫీ పంటను సాగు చేశారు.  అక్కడి నుంచి విశాఖ ఏజెన్సీకి విస్తరించింది. ముఖ్యంగా అరకు, అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు విస్తరించింది. ఆ తర్వాత కాఫీ సాగు తగ్గుముఖం పట్టింది. చివరకు 1960 నాటికి కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగు అయ్యింది. 1985లో ప్రభుత్వాలు మారిన తర్వాత అటవీ అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సేంద్రీయ పద్దతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలైంది.

 

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×