Car Accident: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పొతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడి స్థానికులు పోలీసులు, 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అయితే నెల్లూరులోని నారాయణా మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తమ స్నేహితుడి నిశ్చితార్థంకి వెళ్లి వస్తుండగా.. దారిలో అక్కడి స్థానికులు చెప్పిన విధంగా ఆ కారు అతి వేగంగా వస్తుండటంతో ఆ కారుకి ఏదో అడ్డు వచ్చింది.. కారును సైడుకు తీసుకెళ్లడంతో అక్కడే పక్కన ఉన్న రాయి మీదకు అతి వేగంతో దూసుకెళ్లిన కారు దానికి ఎదురుగా ఉన్న షాపు ఇళ్లు కలిసి ఉండటంతో నేరుగా అక్కడికి వెళ్లి ఢికోట్టడం జరిగింది.
నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిరు. మృతులను జీవన్, విఘ్నేష్, నరేష్, అభిసాయి, అభిషేక్‌గా గుర్తించారు. వీరితో పాటు అక్కడే ఇంట్లో ఉన్న వ్యక్తి కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.. అలాగే విద్యార్థులు అయితే వారి తల్లిదండ్రలు వారికి వాహనాలు ఇవ్వకూడదు. దీంతో వారు తొందరపాటుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కావున తల్లిదండ్రులు విద్యార్థులకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరిక.. జారీ చేస్తున్నారు.