TG Municipal Elections: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. ఇక మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్దమైంది. తెలంగాణలోని అన్ని పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల సంఘం కసరత్తు వేగం చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
తెలంగాణలో మరోసారి ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమవుతుంది. సంక్రాంతి పండగ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నగరా మోగనుందనే టాక్ మంత్రులు నుంచి వస్తుంది. రాష్ట్రంలో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అభివృద్ధి, పాలనను సమాంతరంగా పరుగులు తీయించడమే లక్ష్యంగా ఫిబ్రవరి నెలలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కూడా సమాయత్తం అవుతుందట.
మున్సిపల్ పోరు ప్రధాన పార్టీలకు సవాలుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగుతున్న మున్సినల్ ఎన్నికలు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించకుంది. అటు అధికార పక్షానికే కాకుండా…ఇటు బీఆర్ఎస్,బీజేపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సంక్షేమం,అభివృద్ధి ఎజెండా అదికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్దమవుతుండగా….ప్రభుత్వ వైఫల్యాలను ఆస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్,బీజేపీ సన్నద్ధమవుతున్నాయి.
ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటుంది. పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికలు కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో బయటపడ్డ అంతర్గత విభేదాలను దృష్టిలోపెట్టుకుని ఎమ్మెల్యేలందరు తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటి ఎన్నికలపై దృష్టి పెట్టారట. అభ్యర్థుల ఎంపిక, ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అయితే ఎవరు బలమైన అభ్యర్థి అవుతారనే లెక్కలు వేస్తున్నారట. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకుండా ఇండిపెండెంట్‌గా జరగడంతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అస్కారం లేదు.
దీంతో ఎలాగైనా అత్యధిక వార్డులను గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని అధికార కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేలు లక్ష్యంగా పెట్టుకున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. మున్సిపల్‌ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడంలో భాగంగా గెలుపు బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి ఇన్‌ఛార్జి మంత్రులకు అప్పగించారట. ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించాలని సూచనలు చేశారట. అసెంబ్లీ సమావేశాల తర్వాత మున్సిపాలిటీల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారట.
ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో ఢీలా పడ్డ బీఆర్ఎస్…పట్టణ ప్రాంతాలలో సత్తా చాటేందుకు వ్యూహారచన చేస్తుందట . రెండేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆశించిన స్ధాయిలో ఫలితాలను రాబట్టలేకపోతుంది. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు…నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనకబడి పోయింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎదురైన చెదు అనుభవాన్ని పట్టణ ప్రాంతాల్లో రిపీట్ కాకుండా ఉండేలా పక్కా వ్యూహాంతో అడుగులు వేయడానికి గులాబీ పార్టీ నేతలు సన్నద్దమవుతున్నారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్‌కు ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. పదేళ్ల బీఆర్ఎస్ హయంలో మున్సిపాలిటీల్లో జరిగి అభివృద్ధిని వివరించడంతో పాటుగా…కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మేజార్టీ స్ధానాలను దక్కించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుందట.
అటు కమలం పార్టీ నేతలు కూడా పురపోరు సమాయత్తమవుతున్నారట. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో సంతృప్తిని వ్యక్తం చేసిన బీజేపీ నేతలు…అదే జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లోను మంచి రిజల్స్‌ను సాధించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లకు బీజేపీ విజన్ రీచ్ అవ్వలేదని…ఆ ఫలితాలకు పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి అవకాశం ఉందనేది బీజేపీ నేతలు చెబుతున్న మాట. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతోనే మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుందనేది కమలం పార్టీ నేతల వాదన. ప్రధాని దిశానిర్దేశంతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా ఎన్నికలపై కేంద్రీకరించే అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలతో నేతలంతా ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించేలా వ్యూహారచ చేస్తున్నారట.
సంక్రాంతి తర్వాత ఈనెలఖారు లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని నేతలు భావిస్తున్నారు. అందుకనుగుణంగానే పార్టీలు వ్యూహారచన చేస్తున్నాయట. వచ్చే నెల 3 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్,బీజేపీ నేతలు కూడా మున్సిపాలిటీలో పర్యటించేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి. మొత్తంగా తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి స్టార్ట్ కాబోతుంది.
Story by Ajay, Big Tv