E-Paper
Advertisement

తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
Advertisement

Telangana Airports: స్వేచ్ఛ బ్యూరో: ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతికి ప్ర‌తిరూపాలుగా ఉన్న కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాల‌యం శిల్ప‌, వాస్తు క‌ళ‌ను ప‌రిశీలించి, అవి ప్ర‌తిబింబించేలా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఆదిలాబాద్‌, వరంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌ పై రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

అధికారులకు సీఎం సూచనలు..

Advertisement

ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్ర‌వాహం మార్పు, ర‌హ‌దారుల మ‌ళ్లింపు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగు నీటి స‌ర‌ఫ‌రా లైన్ల మార్పు అంశాల‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు. ఆయా అంశాల‌పై పూర్తి వివ‌రాలు తెలుసుకున్న ముఖ్య‌మంత్రి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. విమానాశ్ర‌యాల కాంపౌండ్ వాల్ స‌మీపం నుంచి ర‌హ‌దారులు నిర్మించాల‌ని, ఆ ర‌హ‌దారుల‌ను స‌మీప జిల్లా, రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానం చేయాల‌ని సూచించారు. ఏ శాఖ‌కు ఆ శాఖ విడివిడిగా ప‌నులు చేప‌డితే, అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌న్నారు.

ఎయిర్‌పోర్టు పనుల్లో వేగం పెంచండి..

Advertisement

విద్యుత్‌, ఆర్ అండ్ బీ, తాగు నీటి స‌ర‌ఫ‌రా, నీటి పారుద‌ల శాఖ అధికారులు స‌మావేశ‌మై బీఎస్ఎన్ఎల్ అధికారుల‌తో చ‌ర్చించి, ఏక‌కాలంలో ప‌నులు సాగేలా చూడాల‌ని సూచించారు. ప్రస్తుత అవ‌స‌రాల‌నే కాకుండా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించుకొని ప‌నులు ముందుకు సాగేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాగులు, ఇత‌ర నీటి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించాల్సి వ‌స్తే, విమానాశ్ర‌యాల ప్రాంగణం లేదా స‌మీపంలో చెరువుల‌ను నిర్మించి, అక్క‌డి నుంచి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విమానాశ్ర‌యాల‌కు వ‌చ్చే, వెళ్లే ర‌హ‌దారులు విశాలంగా ఉండ‌డంతో పాటు స‌మీపంలోని ముఖ్య ర‌హ‌దారుల‌కు అనుసంధానించేలా నిర్మించాల‌ని సీఎం ఆదేశించారు. నిర్దేశిత స‌మ‌యంలో ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌ని ఆదేశించారు.

ప్ర‌తి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి..

ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాల‌తో పాటు ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌కు సంబంధించిన డిజైన్ల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప్ర‌తి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి, శిల్ప‌, వాస్తు క‌ళ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని ఆదేశించారు. ప‌లు ఆకృతుల్లో మార్పుల‌ను సీఎం సూచించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఎంపీలు వేం నరేంద‌ర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల అయిల‌య్య‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్‌, విద్యుత్ శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్‌, ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి గంగాధ‌ర్‌, ప‌వ‌ర్ గ్రిడ్ ఈడీ డొమ‌న్ యాద‌వ్‌, టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వ‌రుణ్ రెడ్డి, ఎయిర్ క‌మోడొర్ రాహుల్ శుక్లా, ఏవియేష‌న్ డైరెక్ట‌ర్ భ‌ర‌త్ రెడ్డి, స్థ‌ప‌తి ఈమ‌ని శివ‌నాగిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

Tags

Related News

పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటా!.. చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మంత్రి ఉత్తమ్

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!

భద్రాద్రి జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

Big Stories

Advertisement
×