BigTV English

Atchannaidu vs Botsa: మండలిలో మాటల మంటలు.. బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు

Atchannaidu vs Botsa: మండలిలో మాటల మంటలు..  బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు

Atchannaidu vs Botsa: రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయంపై చిత్త శుద్ది లేదంటూ సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష నేత బొత్స ఏం మాట్లాడారో తనకు అర్థం కావడం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.


రుణమాఫీ, అన్నదాత సుఖీభవ

అన్నదాత సుఖీభవ అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటన చేశారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన రైతులందరికీ రూ.20 వేల నగదు అందజేస్తామన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలపై విధివిధానాలు ఖరారు చేస్తున్నట్లు చెప్పారు.


వైసీపీ మాదిరిగా తాము రైతులను మోసం చేయమన్నారు. గడిచిన ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారన్నారు. వ్యవసాయ యంత్రాలు లేవు, భూసార పరిక్షలు లేవు, పంటల భీమా చెల్లింపులు అస్సలేవన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.

మెడికల్ కాలేజీల వ్యవహారం

అంతకుముందు ప్రజా సమస్యల పట్ల దేనికి స్పందించాలో లేదో మాకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు బొత్స. శాసన మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారా అని వైసీపీ సూటిగా ప్రశ్నించింది. దీనిపై అధికార పార్టీ రియాక్ట్ అయ్యింది.

ALSO READ: పవన్‌పై జగన్ గురి

మంత్రి వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ రిప్లై ఇచ్చారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. కాకపోతే కాలేజీల నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

ఐదేళ్లలో కేవలం 15 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. నిర్మాణాల గురించి పట్టించుకోని నేతలు, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేవలం పులివెందుల కాలేజికి 59 శాతం నిధులు ఖర్చు చేశారన్నారు. టెండర్‌లే పిలవని పార్వతిపురం కాలేజీని అద్భుతంగా కట్టామని చెప్పడం హస్యస్పదంగా ఉందన్నారు. మెడికల్ విద్యను పేదవాడికి దూరం చేసిందని వైసీపీయేనని ఆరోపించారు మంత్రి సత్య కుమార్.

హంద్రీనీవా ప్రాజెక్టు గురించి

మరోవైపు వచ్చే సీజన్ నాటికి హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమలో నాలుగు జిల్లాల జీవనాడి హంద్రీ నీవా ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారని తెలిపారు.

రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు రూ.3243 కోట్లు కేటాయించామన్నారు. హంద్రీనీవా పాపానికి జగన్ ముమ్మాటికీ కారణమన్నారు. గత టీడీపీ హయాంలో హంద్రీనీవాకు సంబంధించి 80 శాతం పనులు పూర్తి అయ్యాయి.

జగన్ పాలనలో ఒక్క శాతం కూడా పూర్తి కాలేదన్నారు. ఈ రకంగా రాయలసీమకు జగన్ ద్రోహిగా మారారని చెప్పారు. 2014 -19 టీడీపీ పాలనలో హంద్రీనీవాకు రూ.4000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వైసీపీ పాలనలో రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×