BigTV English

Singer Kalpana : సింగర్ కల్పన సూసైడ్ కు కారణం కూతురా?.. విచారణలో విస్తుపోయే నిజాలు..

Singer Kalpana : సింగర్ కల్పన సూసైడ్ కు కారణం కూతురా?.. విచారణలో విస్తుపోయే నిజాలు..

Singer Kalpana : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఉలిక్కిపడేలా చేసింది. ఇండస్ట్రీలో టాప్ సింగర్స్ లలో ఈమె కూడా ఒకరు. 300 సినిమాలకు పైగా ఆమె పాటలు పాడారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినా ఆమె ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంత స్టార్ హోదాలో ఉన్న ఆమె ఎందుకు ఇలా చేసింది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇండస్ట్రీలోని పలువురు సింగర్స్ ఆమె పరిస్థితి గురించి తెలుసుకొని విచారణ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. తాజాగా ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్.. 

నిజాంపేటలోని ఇంట్లో తన రెండో భర్త తో ఆమె నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా తన భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారట.. ఇక ఇంట్లో ఒక్కతే ఉన్న కల్పన రెండు రోజులుగా డోర్ తీయకుండా కనీసం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి పోయిందట.. దీంతో ఇంటి పక్కన ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. అక్కడికి చేరుకున్న పోలీసులు డోర్ ని బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్లి అపస్మార్క స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆమె సూసైడ్ చేసుకుందా? లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? అని పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.


Also Read : వయోలెన్స్ మూవీ మార్కో ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్… ఇక ఆ మూవీని చూడలేం…

పోలీసుల విచారణలో బయటపడ్డ నిజాలు.. 

టాలీవుడ్ పాపులర్ సింగర్ సూసైడ్ చేసుకోవడం పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుంది. తాజాగా ఆమె ఆరోగ్యం పై వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. ఆరోగ్యం పర్వాలేదని వెల్లడించారు. ఇక పోలీసులు ఈ కేసు విచారణను ముమ్మరం చేశారు. ముందుగా ఆమె మొదటి భర్తకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు కల్పనకు పుట్టిన మొదటి కూతురు తో కల్పనకు చాలా రోజులుగా గొడవలు ఉన్నట్లు చెప్పాడు. దానివల్లే ఆమె సూసైడ్ చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా కల్పన పెద్ద కూతురు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు.. ఆమెను కేరళ నుంచి హైదరాబాద్ కు రమ్మంటే రాలేదట. కల్పన కేరళకు వెళ్లి మరీ పిలిచినా కూడా రానని అనడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ కి వచ్చిన అనంతరం మరోసారి కూతురుని హైదరాబాద్ రావాలని కోరిన కల్పనకు కూతురు రానని చెప్పడంతో మనస్థాపానికి గురైంది. దానివల్లే నిద్ర మాత్రలు వేసుకుందని ప్రాధమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆమె రెండో భర్త ప్రసాద్ ను విచారిస్తున్నారు. అనంతరం పెద్ద కూతురిని విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసు గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు..

సింగర్ కల్పన కెరీర్ విషయానికొస్తే.. గాయనిగా పాటలు మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె మూడు వేలకు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనటం ద్వారా సామాన్య ప్రజలకు మరింత దగ్గరయ్యారు.. ఇప్పుడు పలు షోలల్లో పాటలు పాడుతూ బిజీగా ఉన్నారు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×