Tea Side Effects: టీ లవర్స్‌కి కొదవ లేదు. చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తోనే తమ రోజును ప్రారంభించే వారు చాలా మందే ఉంటారు. దీనినే ఖాళీ కడుపుతో టీ తాగడం అని అంటారు. ఈ అలవాటు సాధారణమైనదిగా అనిపించినప్పటికీ ఇది క్రమంగా మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అనేక కడుపు , శరీర సమస్యలకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే హాని ఏమిటి ? దానిని నివారించడానికి ఏం చేయాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే నష్టాలు:
1. నోటి ఆరోగ్యంపై చెడు ప్రభావం:
ఉదయం పూట మన నోటిలో బాక్టీరియా, ధూళి పేరుకుపోతాయి. టీ తాగినప్పుడు ఈ బ్యాక్టీరియా, ఆమ్లాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని వలన దంతక్షయం, దుర్వాసన, చిగుళ్ల సమస్యలు వస్తాయి. అంతే కాకుండా నోటి ఆరోగ్యంపై కూడా టీ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
2. కడుపులో గ్యాస్, ఆమ్లత్వం:
నోటిలో ఏర్పడిన బ్యాక్టీరియాతో పాటు టీ కూడా కడుపులోకి ప్రవేశించినప్పుడు, అది ఆమ్లత్వం, అజీర్ణం , గ్యాస్ సమస్యను పెంచుతుంది. దీనివల్ల ఉదయం కడుపు బరువుగా , అసౌకర్యంగా అనిపించవచ్చు. అంతే కాకుండా గ్యాస్ సమస్య పెరిగేందుకు కూడా ఇది ఒక కారణం అవుతుంది. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ తాగకుండా ఉండటం మంచిది.
3. జీవక్రియపై ప్రతికూల ప్రభావం:
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరం యొక్క జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది బరువు పెరుగడానికి కూడా కారణం అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు పెరగడానికి ఉదయం పూట టీ తాగడం కూడా ఒక కారణం.
4. రోగనిరోధక వ్యవస్థ :
నోటిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అది రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు , వ్యాధులతో పోరాడటంలో ఇబ్బంది పడతారు. తరచుగా టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి ప్రభావితం అవుతుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా మారడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
5. శరీరంలో టాక్సిన్స్ పెరుగుదల:
ఉదయం నిద్రలేచిన తర్వాత, నోటిలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. అందుకే ఉదయం టీ తాగితే, ఈ టాక్సిన్స్ నేరుగా మీ శరీరంలోకి వెళ్లి, చర్మ సమస్యలు, అజీర్ణం ,ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కొంత మంది రోజులో 2-3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా టీ తాగుతారు. ఇలాంటి అలవాటు ఆరోగ్యానికి హాని చేస్తుంది.
Also Read: ఇలా చేస్తే.. నల్లగా మారిన కాళ్ల పట్టీలైనా కొత్త వాటిలా మెరిసిపోతాయ్ !
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి ?
ఉదయం లేవగానే ముందుగా గోరు వెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల నోటిలోని మురికి లోపలికి వెళ్లదు, శరీరం కూడా విషపూరితంగా మారకుండా ఉంటుంది.
బ్యాక్టీరియా , టాక్సిన్స్ తొలగించడానికి టీ తాగే ముందు బ్రష్ చేయడం లేదా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
మీరు వెంటనే ఏదైనా తాగాలనుకుంటే, టీకి బదులుగా నిమ్మకాయ నీరు, సాదా నీరు లేదా కొబ్బరి నీరు త్రాగవచ్చు.
ఒక వేళ టీ తప్పకుండా ఉదయం తాగాలని అనిపిస్తే.. టిఫిన్ తినండి. తద్వారా అది కడుపుపై పెద్దగా ప్రభావం చూపదు.