E-Paper
Advertisement

టీచర్లపై దాడి చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం.. వైసీపీకి మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

టీచర్లపై దాడి చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం.. వైసీపీకి మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్
Advertisement

Anantapur: వైసీపీ అధినేత జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. విజయవాడలో ఉపాధ్యాయుల దాడి ఘటనపై తొలిసారి నోరు విప్పారు. డీఎస్సీపై నేను చర్చకు సిద్ధమేనని, నువ్వు సిద్ధమా జగన్? అంటూ ప్రశ్నించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులపై దాడులు చేశారని, వారంటే ఎందుకు అంత కక్ష అంటూ ప్రశ్నించారు. వారిపై గుడ్లతో దాడి చేస్తారా? అసభ్యకరంగా మాట్లాడుతారా? అసలు మీరు ఎక్కడ చదివారు? ఎవరు చదివించారు? ఇదేనా మీకు తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతి అంటూ ప్రశ్నించారు.

వైసీపీకి మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

టీచర్ల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు మంత్రి. అన్నీ చూస్తున్నానని, ఏ ఒక్కరిన్నీ ఎవరినీ వదిలిపెట్టనని వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను రెడ్ బుక్‌లో రాసుకున్నానని, అందులో పేర్లు ఉన్నవారిని వదిలి పెట్టనని కుండబద్దలు కొట్టేశారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. నీలాగ ఎక్కడికైనా వెళ్లాలంటే కోర్టుల పర్మిషన్ తీసుకోనని, నీతి నీజాయితీగా బతికామన్నారు. మీరు పెట్టినవి దొంగ కేసులను సుప్రీంకోర్టు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు.

టీచర్లపై దాడి చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం-మంత్రి

Advertisement

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు వచ్చిన మంత్రి లోకేష్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న మన పార్టీలో ఉన్నప్పుడు వంగి వంగి ఉన్నారని, ఇప్పుడు కాలర్ ఎగరేసుకుంటున్నారని గుర్తు చేశారు. గొడ్డలితో బతికేవాళ్లు, దాంతోనే పోతారన్నారు. ఎన్నికల్లో తగ్గేది లేదన్నారు. కష్టపడి పని చేయాలని, మనదంతా పెద్ద కుటుంబమన్నారు. పవన్ అన్న మన కుటుంబ సభ్యుడేనన్నారు. బీజేపీ కూడా మన కుటుంబంలో చేరిందన్నారు.

ALSO READ: సినీ, టీవీ రంగానికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..?

Advertisement

కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. సమస్యలు మనం పరిష్కరించుకుందామన్నారు. ప్రజల చుట్టూ మీరు ఉండాలని, మిమ్మల్ని చూసి నేను వస్తానని వెల్లడించారు. ఇగోలు, అహంకారం వద్దని, ప్రజలతో ఉందామన్నారు. వారితో కలిసి వెళ్తామన్నారు. నా తమ్ముడు పరిటాల శ్రీరామ్ పుట్టి నరోజని, ఉదయం లేవగానే బర్త్ డే శుభాకాంక్షలు చెప్పానని గుర్తు చేశారు. మన సత్తా ఏంటో రానున్న ఎన్నికల్లో చూపించాలని పార్టీ కేడర్‌కు పిలుపు ఇచ్చారు.

Related News

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు!

కానిస్టేబుళ్లకు బంపర్ ఆఫర్.. స్టైపెండ్ రూ.12,500కు పెంపు: హోంమంత్రి అనిత

సినీ, టీవీ రంగానికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..?

విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!

కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Big Stories

Advertisement
×