E-Paper
Advertisement

కొడుకు పేరును రివీల్ చేసిన నారా రోహిత్.. పేరుకు అర్థం ఇదేనా?

కొడుకు పేరును రివీల్ చేసిన నారా రోహిత్.. పేరుకు అర్థం ఇదేనా?
Advertisement

Nara Rohit: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న వారిలో నారా రోహిత్(Nara Rohit) ఒకరు. ఈయన పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ఆదర్శ కుటుంబం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న నారా రోహిత్ మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈయన గత ఏడాది సినీనటి సిరిలెల్లా (Siri Lella)తో కలిసి ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇలా గత ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన నారా రోహిత్ దంపతులు ఈ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

నందన్ రామ నారా..

ఈ దంపతులకు మగ బిడ్డ జన్మించినట్లు గత కొద్ది నెలల క్రితం నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు కానీ ఇప్పటివరకు బాబు ఎలా ఉంటారనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. ఇకపోతే తాజాగా తన కొడుకుకు నామకరణ వేడుకను నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సిరి నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కొడుకు పేరును రివిల్ చేశారు. ఇక రోహిత్ తన కొడుకుకు” నందన్ రామ నారా”(Nandhan Rama Nara) అని పేరు పెట్టిన విషయాన్ని తెలియజేశారు.

అవధులు లేని ఆనందాన్ని కలిగించేవాడు..

Advertisement

తన కొడుకు నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ప్రేమ ఆనందంతో నిండిన హృదయాలతో మా కుమారుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే తన కొడుకుకు నందన్ రామ అని పేరు పెట్టడానికి అలాగే ఈ పేరుకు అర్థాన్ని కూడా రోహిత్ తెలిపారు. నందన్ అంటే అవధులు లేని ఆనందాన్ని కలిగించేవాడని అర్థం అని రోహిత్ తెలిపారు.రామా అనే పేరును తన తాతగారి గౌరవార్థం ప్రేమతో ఆ పేరును ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. ఇలా తన కొడుకుకు పెట్టిన ఈ పేరు కేవలం పేరు మాత్రమే కాకుండా, మా కుటుంబ ప్రేమ ,జ్ఞాపకాలను తరతరాలుగా అందించిన అందమైన వారసత్వాన్ని కలిగి ఉందని ఈయన తన కొడుకు పేరును తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా తమ కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను రోహిత్, సిరి షేర్ చేసినప్పటికీ ఇక్కడ కూడా తన కొడుకు ఎలా ఉంటారనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. ఇలా తన కొడుకు పేరుని తెలియజేయడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఇక నారా రోహిత్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది భైరవం సినిమా, సుందరకాండ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక త్వరలోనే విక్టరీ వెంకటేష్(Venkatesh) త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbham)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నారా రోహిత్ నటించారని తెలుస్తోంది.

Also Read: రణబాలి ‘ఏందయ్యా సామి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Related News

ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి మాతృవియోగం!

తాతయ్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన ఉపాసన.. వెల్లువిరిసిన ఆధ్యాత్మికత!

బ్లడ్ అమ్ముకుని సంపాదించాల్సిన ఖర్మ నాకేంటి? చిరు షాకింగ్ కామెంట్స్!

మైనర్ బాలికపై దారుణం.. దిశా పటానీ సిస్టర్ ఫైర్!

రణబాలి ‘ఏందయ్యా సామి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్!

15 ఏళ్ల తర్వాత నంది అవార్డులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

నాని ‘ది ప్యారడైజ్’కు రూ.200 కోట్ల టార్గెట్.. సినిమా ఏం చేస్తుందో?

Big Stories

Advertisement
×