E-Paper
Advertisement

Amaravati News: మంత్రి లోకేష్ గొప్ప మనస్సు.. ఆ చిన్నారికి చేయూత, మా దేవుడు మీరు సార్

Amaravati News: మంత్రి లోకేష్ గొప్ప మనస్సు.. ఆ చిన్నారికి చేయూత, మా దేవుడు మీరు సార్
Advertisement

Amaravati News: ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అనేక మంది అభాగ్యులకు అండగా నిలిచిన ఆయన, అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఏకంగా రూ. 6 కోట్లు సమకూర్చే  బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. దీంతో చిన్నారి తల్లిదండ్రుల్లో ఆనందం అంతా ఇంతా కాదు.

అరుదైన వ్యాధితో భాదపడుతున్న కర్నూలు జిల్లాకి చెందిన ఓ చిన్నారి 

Advertisement

కర్నూలు జిల్లాకు చెందిన బాలిక పునర్విక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు అనుక్షణం బాధపడేవారు. ఆ చిన్నారికి జబ్బు నయం కావాలంటే రూ.16 కోట్లు అవసరం. ఇప్పటివరకు సేకరించిన నిధులు రూ.10 కోట్ల వరకు వచ్చాయి. మరో రూ.6 కోట్లు అవసరం కాగా దానిపై చిన్నారి తల్లిదండ్రులు ఎక్కని గడప లేదు. ఈ విషయం చివరకు మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఓ ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ఆ మొత్తం చూసే బాధ్యత తనదేనని హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులకు ఆయనలో దేవుడ్ని చూసుకున్నారు.

కర్నూలుకి చెందిన ఓ చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతోంది. దీనికపై కొంతమంది వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి సోషల్ మీడియా ద్వారా నిధులు సేకరిస్తున్నారు. పునర్విక కుటుంబానికి చాలామంది తమవంతు సాయం అందజేశారు. పునర్విక ఎస్ఎంఏ టైప్-1 వ్యాధితో బాధపడుతోంది. SMA టైప్-1 అనేది అరుదైన జన్యుపరమైన వ్యాధి. పిల్లల కండరాలను బలహీనపరుస్తుంది.

Advertisement

మంత్రి లోకేష్ గొప్ప మనస్సు.. ఆ చిన్నారికి చేయూత

మనిషి కదలకుండా, శ్వాస తీసుకోవడానికి, సాధారణంగా జీవించడానికి వీలు లేకుండా చేస్తుంది. అయినప్పటికీ చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో పోరాటం చేస్తోంది. చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం కేవలం ఒక్క ఇంజెక్షన్ మాత్రమే. మార్కెట్లో దాని విలువ అక్షరాలా 16 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయల వరకు విరాళాలు సేకరించింది. మరో 6 కోట్ల రూపాయలు కావాల్సివుంది.

ఈ విషయమై పునర్విక తండ్రి మంత్రి నారా లోకేశ్‌కు ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇంకా కావాల్సిన మిగతా 6 కోట్ల రూపాయలపై తన వంతు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పునర్విక ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చినవారు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ALSO READ: పునర్వికకు పునర్జన్మ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవతా సంకల్పం

పునర్విక తల్లిదండ్రులకు తనవంతు సహాయం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. చిన్నారి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు సహకరించేలా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు సదరు మంత్రి. పునర్వికకు సహాయం చేయడానికి మరింత మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×