E-Paper
Advertisement

Romantic Web series OTT: ఇద్దరు భర్తల ముద్దుల పెళ్ళాం… మస్త్ మజా ఇచ్చే జపనీస్ సిరీస్

Romantic Web series OTT: ఇద్దరు భర్తల ముద్దుల పెళ్ళాం… మస్త్ మజా ఇచ్చే జపనీస్ సిరీస్
Advertisement

Romantic Web series OTT : ట్రయాంగిల్ ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. ఈ కంటెంట్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుంది. ఎప్పటినుంచో ఈ స్టోరీలకు ఆదరణ ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సిరీస్ ముగ్గురు వ్యక్తుల మధ్య సంబంధంతో నడిచే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. వీళ్ళు అంటే ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు ఏడాది భార్యాభర్తలుగా ఉంటారు. ఈ ప్రయాణం చివరికి ఏమైందనేదే ఈ కథ. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

2025లో వచ్చిన ఈ జపనీస్ రొమాంటిక్ డ్రామా సిరీస్ పేరు ‘టూ హస్బెండ్స్ వన్ వైఫ్’ (Two Husbands One Wife). జపనీస్ లో దీనిని Sannin Fufu అని కూడా పిలుస్తారు. ఇందులో అకి అసకురా (మియా), తైగా సుజుకి (షిన్పెయి), కోడై అసకా (తకుజో) లీడ్ రోల్స్ లో నటించారు. మొత్తం 11 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం Netflix లో అందుబాటులో ఉంది. ఇది తెలుగు ఆడియోలో కాకుండా, ఒరిజినల్ జపనీస్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో లభిస్తుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మియా అనే యువతి తన ప్రియుడు షిన్పెయితో కలిసి బ్రతకాలని కలలు కంటుంది. కానీ షిన్పెయి ఒక వింత మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతనికి పెళ్లి అంటే భయం లేదు కానీ, బాధ్యతలు మోయడం కష్టమని ఫీలవుతాడు. అందుకే అతను ఒక వింత ప్రతిపాదన చేస్తాడు. మియాకు పాత ప్రేమికుడైన తకుజోను కూడా పిలిచి, ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా ఉందామంటాడు. తకుజోకు కూడా మియా అంటే ఇష్టం ఉండటంతో, మొదట సందేహించినా చివరికి ఈ ట్రయల్ మ్యారేజ్ కు అందరూ ఒప్పుకుంటారు.
ఒకే ఇంట్లో ఇద్దరు మొగుళ్ళు, ఒక భార్య కాపురం మొదలుపెట్టాక అసలు కథ మొదలవుతుంది.

ఇంట్లో పనులు పంచుకోవడం దగ్గరి నుండి, మియా పక్కన ఎవరు పడుకోవాలి అనే విషయంలో వచ్చే చిన్న చిన్న గొడవలు, సరదాలు ఇందులో చాలా సహజంగా ఉంటాయి. అయితే బయట వాళ్ళకు ముగ్గురూ కలిసి ఉంటున్నారనే విషయం తెలియకుండా దాచడానికి పడే కష్టాలు నవ్వు కూడా తెప్పిస్తుంటాయి. ఇందులో జలసితో సాగే సీన్స్ ఆకట్టుకుంటాయి. చివరికి వీళ్ళ రిలేషన్ ఏమవుతుంది ? ముగ్గురూ కలసే ఉంటారా ? మియాతో కలసి నడిచేది ఎవరు ? అనే విషయాలను, ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : భయపెడుతూ నవ్వు తెప్పించే మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×