BigTV English

Minister Lokesh in Delhi: ఢిల్లీ టూర్‌లో మంత్రి లోకేష్ బిజీ, మా టార్గెట్ అదే

Minister Lokesh in Delhi: ఢిల్లీ టూర్‌లో మంత్రి లోకేష్ బిజీ, మా టార్గెట్ అదే

Minister Lokesh in Delhi: ఢిల్లీ టూర్‌లో బిజి బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. కేంద్ర బడ్జెట్ ఐపోవడంతో నిధులు, ప్రాజెక్టులు రాబట్టేందుకు తీవ్రంగా ఫోకస్ చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రులతో నిత్యం సమావేశమవుతూ రాష్ట్రానికి రావాల్సిన దానిపై చర్చిస్తున్నారు.


బుధవారం ఉదయం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాజకీయాలతోపాటు అభివృద్ధి పనులపై మాట్లాడారు. అదే సమయంలో పార్టీ ఎంపీలు, టీడీపీకి చెందిన కేంద్రమంత్రులను ఆయనకు పరిచయం చేశారు మంత్రి లోకేష్.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు తమ రాష్ట్రానికి వచ్చేలా సహకరించాలని కోరారు. కేంద్రం సహకారంతో రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్‌నాథ్‌‌కు తెలిపారు.


ఏపీకి ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి లోకేష్. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌లు, పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్రమంత్రులతో చర్చించి నట్టు మీడియాతో చెప్పారు. అమెరికాలో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిన కంపెనీల ఫీడ్ బ్యాక్‌ గురించి మంత్రులకు వివరించారు.

రైల్వే మంత్రి వైష్ణవ్ త్వరలో విశాఖ, తిరుపతిలలో పర్యటించి, చేపట్టిన పనులను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఏపీకి తీసుకురావడానికి కల్పించాల్సిన వాతావరణంపై చర్చించినట్టు వివరించారు.

ALSO READ: కేజీహెచ్ ఆసుపత్రిలో రౌడీ షీటర్ హల్ చల్.. తప్పిన పెను ప్రమాదం

ముఖ్యంగా డేటా సిటీల కోసం ఏటా ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. అందులో 100 బిలియన్ డాలర్లు ఇండియాకు వచ్చే వీలుంది. మెజార్టీ వాటా ఏపీకి రావాలన్న స్వార్థం తనకు ఉందన్నారు మంత్రి లోకేష్.

మరో రెండు నెలల్లో వైజాగ్‌లో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు మంత్రి. శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూమి కోసం అన్వేషణ జరుగుతోందని వివరించారు. కాగ్నిజెంట్ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వస్తుందని, ఏడాదిలో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేసుకుంటూ వెళ్తామన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని, అందుకు కేంద్రం సహకారం కావాలని కోరినట్టు తెలిపారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కోరినట్టు తెలియజేశారు.

ఈ క్రమంలో మీడియా పలు ప్రశ్నలు లేవనెత్తింది. డేటా చోరీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ఛాలెంజ్ గురించి నోరు విప్పారు మంత్రి లోకేష్. ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుకగా ఇస్తానన్నారు. ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా తాను చెక్‌ను ఇస్తానని తెలిపారు. తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్‌కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుంది? ప్రశ్నించారు.

గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు డేటా చోరీ జరిగినట్టు వైసీపీ ఆరోపించింది. గడిచిన ఐదేళ్లలో దాని ఊసే లేదన్నారు. అధినేతపై తప్పుడు కేసు పెట్టి 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారని గుర్తు చేశారు. అలాంటివాళ్లు తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసి ఉంటే ఊరికే వదిలిపెడతారా? మాకు ప్రజల డేటా అక్కర్లేదని, కావాల్సింది ఓటర్ లిస్టు మాత్రమేనని, అది పబ్లిక్ డాక్యుమెంట్ అని తెలిపారు.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×