Akkineni Naga Chaitanya : తెలుగు ఇండస్ట్రీ అంటే… మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని అంటూ కొన్ని కుటుంబాల పేర్లు చెబుతూ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ హీరోలు… వాళ్ల వారసులను కూడా సినిమాల్లోకే తీసుకురావడంతో ఈ కుటుంబాలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాయి.
అలా… ANR వల్ల అక్కినేని కుటుంబం కూడా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్ ఫ్యామిలీగా మారింది. అయితే ఈ కుటుంబం మాత్రం ఆ పెద్దాయన ANR లెజండరీని కొనసాగించడం లేదు అంటూ ఈ మధ్య కాలంలో విమర్శలు వస్తున్నాయి. ఈ కుటుంబానికి ఓ తీరని లోటు ఉందని, దాన్ని నాగార్జున మాత్రమే కాదు… ఆయన ఇద్దరు కొడుకులు కూడా తీర్చడం లేదు అంటూ సొంత ఫ్యాన్సే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య ఆ లోటు తీరుస్తారని నమ్ముతున్నారు.
ఇంతకీ అక్కినేని కుటుంబానికి ఉన్న లోటు ఏంటి..?
నాగ్ అండ్ ఆయన కొడుకులు ఏం చేయలేకపోయారు..?
సొంత ఫ్యాన్సే ఎందుకు విమర్శిస్తున్నారు..?
నాగా చైతన్య చేయాల్సింది ఏంటి..?
అనేవి ఇప్పుడు చూద్ధాం…
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు బాగా రావడం, కలెక్షన్లు భారీగా రావడం బాగానే ఉంది కానీ, అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది.
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఫస్ట్ సీనియర్ హీరో 300 కోట్ల క్లబ్‌లో చేరాడు అంటూ వెంకటేష్‌పై వార్తలు వచ్చాయి. అక్కడితో ఆగిపోలేదు. దీని తర్వాత అందరి చూపులు అక్కినేని కుటుంబంపై పడ్డాయి. ముఖ్యంగా నాగార్జునపై దీని ప్రభావం చాలా ఎక్కువే చూపించింది.
నాగార్జునకే రాలేదు…
నాగ్ ఇన్ని ఏళ్ల కెరీర్‌లో ఒక్కటి అంటే ఒక్క 100 కోట్ల మూవీ లేదు. హైయెస్ట్ అంటే… 85 కోట్లే. సోగ్గాడే చిన్ని నాయన అనే మూవీకి 85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఊపిరి మూవీ 90 కోట్ల వరకు లాక్కొచ్చింది. కానీ, అది మల్టీస్టారర్ మూవీ. కాబట్టి ఫుల్ క్రెడిట్ నాగార్జనకు మాత్రమే ఇవ్వలేం.
నాగ చైతన్య పరిస్థితి ఇది…
ఇక అక్కినేని వారసుడు నాగ చైతన్యకు హైయెస్ట్ కలెక్షన్లు అంటే 70 కోట్లు. సమంతతో కలిసి చేసిన మజిలీ మూవీకి దాదాపు 70 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీని తర్వాత లవ్ స్టోరీ మూవీకి 60 కోట్ల వరకు వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన కలెక్షన్లు అంతంత మాత్రామే.
అఖిల్ గురించి అంటే…
ఇక చిన్న వారసుడు అఖిల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిందేమో. ఏజెంట్ మూవీ అని రెండేళ్ల క్రితం ఒకటి వచ్చింది. దాదాపు 85 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిందా మూవీ. కానీ, కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయకుండా బిగెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
చైతుపైనే ఆశలన్నీ…
అక్కినేని కుటుంబంలో ఉన్న ఆ 100 కోట్ల లోటును తీర్చేది నాగ చైతన్య అనే నమ్ముతున్నారు అభిమానులు. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ఈ నెల 7న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 90 కోట్లు. సాయి పల్లవి, మంచి ప్రమోషన్లు, కొన్ని సాంగ్స్ వల్ల మూవీపై ఇప్పటి వరకు అయితే మంచి బజ్ ఉంది. ఇది సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఇక సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వస్తే… ఈజీగా 100 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది.
పైగా ప్రస్తుతం ఈ సినిమాకు పెద్దగా పోటీ అయితేే లేదు. ఇది మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.