ఇటీవల వైసీపీ నేత ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సందర్భంగా ఒక చిన్న సైకిల్ ని అక్కడకు తెచ్చి దాన్ని కిందపడేసి తొక్కారు. తుక్కు తుక్కు చేయాలనుకున్నారు. ఇంతలో ఓ పిల్లవాడు వచ్చి ఆ సైకిల్ తీసుకెళ్లాడు. వారు ఆ సైకిల్ ని ధ్వంసం చేస్తున్నప్పుడు కూడా ఆ పిల్లవాడు దాని దగ్గరకు రావడం, వారి దెబ్బకు తాళలేక తిరిగి వెళ్లిపోవడం అందరూ చూశారు. ఇలాంటి చేష్టలు చూసే సైకో అని పేరు పెట్టామంటూ లోకేష్ ధ్వజమెత్తారు. సందర్భం లేకపోయినా ఇలా సైకోల్లా ప్రవర్తించడమేంటని ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు.
#PsychoJagan #YSRCPRowdyism
అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని… pic.twitter.com/8fKlFYmG2o— Lokesh Nara (@naralokesh) June 1, 2025
అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నా..
అధికారం కోల్పోయినా వైసీపీ వాళ్లు ఏమీ మారలేదన్నారు లోకేష్. మారరు కూడా అని అన్నారు. సైకో అనే పేరు సార్థకం చేసుకోడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారన్నారు. నాటికి నేటికీ ఎప్పటికీ వైసీపీ ఒక సైకో పార్టీ అంటూ ద్వజమెత్తారు. వాళ్ళకి సైకో నాయకుడు ఉన్నారన్నారు. వీరందరికీ గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి బుద్ధి మారలేదన్నారు. మైలవరంలో వైసీపీ నేత ఇంట జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన కార్యకర్తలు తమ సైకో బుద్ధి చూపించారంటూ లోకేష్ ట్వీట్ వేశారు. చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత గా అర్థం చేసుకోవాలనే తాను ఆ వీడియో పోస్ట్ చేస్తున్నానన్నారు లోకేష్.
అయితే లోకేష్ కి కౌంటర్ గా వైసీపీ నుంచి కూడా కొన్ని ట్వీట్లు పడ్డాయి. ఆ వీడియోల్లో టీడీపీ నేతల హంగామా కనపడుతోంది. అయితే అవన్నీ పాత వీడియోలు. ఎన్నికల వేళ ఇలాంటివి సహజం అని, కానీ ఎన్నికలు లేని సందర్భాల్లో ఇలాంటి చేష్టలు సరికావని అంటున్నారు నెటిజన్లు. వైసీపీ కార్యకర్తల తీరుని తప్పుబడుతున్నారు.
సందర్భం ఏంటి..?
ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒక పార్టీ సింబల్స్ ని మరో పార్టీ వెటకారం చేయడం కామన్. కానీ సమయం సందర్భం లేకుండా సైకిల్ పై వైసీపీ కార్యకర్తలు తమ ప్రతాపం చూపించడం మాత్రం సంచలనంగా మారింది. లోకేష్ తన ట్వీట్ లో మెన్షన్ చేయడానికి ముందే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లవాడి సైకిల్ ని తీసుకుని తొక్కడం సరికాదంటూ చాలామంది నెటిజన్లు విమర్శించారు. సైకిల్ తొక్కుతూ రాక్షసానందం పొందడం సరికాదని అన్నారు.
ఏపీలో పొలిటికల్ హీట్..
ఏపీలో ఎన్నికలు లేవు, మరో ఏడాదిలో కూడా రావు. ఇంకో నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితి అలా లేదు. రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగా పొలిటికల్ హీట్ నెలకొని ఉంది. ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలా టీడీపీ, వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. వాటికి అదనంగా ఇలాంటి సైకిల్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.