Flights Tickets Discount: నైరుతి రుతుపవనాలు వేగంగా ప్రవేశించడంతో ఆలోచలో పడ్డాయి దేశంలోని విమాన కంపెనీలు. జూన్ 15 వరకు తమ వ్యాపారానికి ఢోకా ఉండదని తొలుత భావించాయి. మే 25 నాటికి దేశంలో రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో వ్యాపారం కాస్త మందగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తమ తమ అస్త్రాలను బయటపెట్టాయి. టికెట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో మిగతా ఎయిర్‌లైన్స్ కంటే ఎయిరిండియా ఓ అడుగు ముందు ఉందనే చెప్పాలి.
నార్మల్‌గా విమాన టికెట్ ధరలు సాధారణంగా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా అనుకోకుండా చివరి నిమిషంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో ధరల గురించి చెప్పనక్కర్లేదు. చాలామంది మధ్య తరగతి ప్రజలు ఆ తరహా ప్రయాణికులకు దూరంగా ఉంటారు. కాకపోతే వేగంగా డెస్టినేషన్‌కు చేరుకోవచ్చు.
తాజాగా ఎయిరిండియా ప్రయాణికులకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. లాస్ట్ మినిట్ (LASTMINUTE) ఫ్లైట్ డీల్స్ భాగంగా అదే కోడ్‌తో యాప్ లేదంటే వెబ్ పోర్టర్‌లో విమాన టికెట్లపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మే 29న ప్రారంభమైన డిస్కౌంట్ జూన్ నాలుగు వరకు కొనసాగుతుంది. అంతేకాదు జూన్ 5 వరకు బుక్ చేసుకునే టికెట్ బుకింగ్స్‌పై 10 శాతం వరకు డిసౌంట్‌ని పొందవచ్చు.
అయితే ఈ డిస్కౌంట్ ఏయే ప్రాంతాలకు ఇస్తుందని అనేది మీ డౌట్. అక్కడికి వచ్చేద్దాం. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా,చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ డిస్కౌంట్ ఇస్తోంది ఎయిరిండియా సంస్థ. అయితే డిస్కౌంట్లు ఏ విమాన సేవలకు వర్తిస్తాయనే విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి వుంటుంది.
ALSO READ: బడ్జెట్ ఫ్రెండ్లీ ఫారిన్ వెకేషన్.. వీసా లేకుండానే
ఎయిరిండియా ‘లాస్ట్ మినట్’ ఫ్లైట్ డీల్‌కి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్ పెట్టింది ఆ సంస్థ. ఇంతకీ ఆ కండీషన్స్ ఏంటి? జూన్ 4న రాత్రి 11:59 గంటల వరకు బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్డ్ విధానంలో సీట్లను కేటాయిస్తారు. బేస్ ఛార్జీలపై ప్రోమో కోడ్ అప్లై కానుంది. పెద్దలు, పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
శిశువులకు నో ఛాన్స్. ఈ ఆఫర్‌నిని మరే ఇతర డిస్కౌంట్స్ పై అప్లై చేయడం కుదరదు. అలాగే గ్రూప్ బుకింగ్స్‌కి అర్హత లేదు. విమాన టికెట్ మాడిఫై, సస్పెండ్, రద్దు చేసే హక్కు సదరు ఎయిర్ లైన్స్ సంస్థకు మాత్రమే ఉంది. లాస్ట్ మినట్ డీల్స్ డిస్కౌంట్ ఉపయోగించి డబ్బులు ఆదా చేసుకోవడానికి ప్రయాణికులు ఉపయోగపడుతుంది. ఈ డీల్ కంటిన్యూ ఉంటే బాగుందని అంటున్నారు కొంతమంది వినియోగదారులు.