Bandla Ganesh : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత రమేష్ బాబు (Singanamala Ramesh Babu) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై సంచలన కామెంట్స్ చేశారు. కొమరం పులి (Komaram Puli), ఖలేజా (Khaleja) వంటి సినిమాలతో తనకు 100 కోట్ల నష్టం వచ్చిందని, ఏడాది చేయాల్సిన సినిమాలకు మూడేళ్ల టైం పట్టిందని, ఎవ్వరూ పట్టించుకోలేదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ పై మరో నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Badla Ganesh) స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ని అంటే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు.
బండ గణేష్ రియాక్షన్
బండ్ల గణేష్ తన ట్వీట్ లో “సింగనమల రమేష్ గారు… మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేదు. అది మీ తప్పు. మీకోసమే పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ సినిమా చేయకుండా, కొన్ని వందల కాల్షీట్స్ ని వేస్ట్ చేసుకున్నారు.. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి. ఇది కరెక్ట్ కాదు ” అంటూ పోస్ట్ చేశారు. అటు నిర్మాత రమేష్, ఇటు బండ్ల గణేష్ ఆయనకిచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం @PawanKalyan గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు . https://t.co/LVGihOWIhI
— BANDLA GANESH. (@ganeshbandla) February 5, 2025
అసలు వివాదం ఏంటంటే?
తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఇద్దరు పెద్ద హీరోల వల్ల తనకు 100 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని నిర్మాత రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారంటే… 2011లో గచ్చిబౌలిలో ఓ హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి, 12 కోట్లు స్వాహా చేసినట్టు రమేష్ బాబు పై కేసు ఫైల్ అయింది. ఈ కేసులో ఆయన 78 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. అయితే 2025 జనవరి 31న ఈ కేసులో రమేష్ బాబు పై మోపిన నేరానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో, ఆయనను కోర్టు నిర్దోషిగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో రమేష్ బాబు మాట్లాడుతూ”నా మీద మోపిన అబద్ధపు కేసుల వల్ల 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. ఎట్టకేలకు ఇప్పుడు ఈ కేసులో విజయం సాధించాను. అబద్ధపు కేసులు ఎన్నటికీ నిలబడవు. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ల మీద కూడా న్యాయపోరాటం చేస్తాను. కానీ నేను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా కనీసం ఫోన్ చేసి, పలకరించిన పాపానా పోలేదు. పెద్ద పెద్ద హీరోలతో కూడా పని చేశాను. వాళ్ల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కొమరం పులి, ఖలేజా వంటి సినిమాల వల్ల నాకు ఏకంగా 100 కోట్ల నష్టం వచ్చింది. అప్పట్లోనే ఏడాది చేయాల్సిన సినిమాలకు మూడేళ్లు పట్టింది” అంటూ ఇండస్ట్రీ నుంచి ఏ మాత్రం తనకు సపోర్ట్ దొరకపోవడం పట్ల రమేష్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు సపోర్ట్ గా ఆయన భక్తుడు బండ్ల గణేష్ వాయిస్ రైజ్ చేశారు.