ICC T20I Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టి-20 ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టి-20 ల సిరీస్ {India – England 5 T-20 Series} ని 4-1 తో భారత్ కైవసం చేసుకోవడంతో ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ {ICC T20I Rankings} లో టీమిండియా {India} అగ్రస్థానంలో నిలిచింది. 73 మ్యాచ్ లు ఆడిన భారత్ 268 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియ {Australia} 259 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది.
Also Read: Rohit Sharma Retirement: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ పై డేట్ ఫిక్స్?
ఇంగ్లాండ్ 205 పాయింట్లతో మూడవ స్థానం, వెస్టిండీస్ 247 పాయింట్లు నాలుగవ స్థానం, న్యూజిలాండ్ 2047 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాయి. సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి. ఇక టి-20 బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ {Abhishek Sharma} 829 పాయింట్లతో 38వ స్థానం నుంచి రెండవ స్థానంలోకి దూసుకొచ్చాడు. అభిషేక్ శర్మ కేవలం టి-20 బ్యాటింగ్ ర్యాంక్స్ లో మాత్రమే కాకుండా ఆల్రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు వేగబాకి 13వ ర్యాంక్ కి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావీస్ హెడ్ 855 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక మూడవ స్థానంలో మరో టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ {Tilak Varma} 803 పాయింట్లతో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయాడు. నాలుగవ స్థానంలో కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఒక మెట్టు దిగి 738 పాయింటులతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే {ICC T20I Rankings} బౌలింగ్ లో ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి {Varun Chakravarthy} మానియా నడుస్తోంది. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని స్టైల్, యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది.
ఇది అతని ఐసీసీ ర్యాంకింగ్స్ ని కూడా ప్రభావితం చేసింది. {ICC T20I Rankings} ఐసీసీ టి-20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో వరుణ్ చక్రవర్తి {Varun Chakravarthy} 705 పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. 705 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్ రెండవ స్థానంలో ఉండగా, 707 పాయింట్లతో వెస్టిండీస్ ప్లేయర్ అకేల్ హోసేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా టి-20 ఆల్ రౌండర్ల జాబితాలో 251 పాయింట్లతో హార్దిక్ పాండ్యా {Hardik Pandya} అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read: SRH: ఒకటి కాదు 5 బుల్డోజర్లు.. గట్టు దాటితేనే వేసేస్తాం… భయంకరంగా మారిన SRH టీం?
161 పాయింట్లతో మరో ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఒక స్థానం ఎగబాకి 11వ స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టి-20 సిరీస్ {India – England 5 T-20 Series} లో బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, ఆల్ రౌండర్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా ఐసీసీ టి-20 ర్యాంకింగ్స్ లో వారి స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఈ నేపథ్యంలో భారత యువ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు క్రీడాభిమానులు.
No.2 Ranked batter – Abhishek Sharma.
No.2 Ranked bowler – Varun Chakravarthy.
– THE DOMINANCE OF INDIA IN T20IS. 🇮🇳 pic.twitter.com/slzGK4We0e
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2025