Amaravati News: ఏపీ రాజధాని నిర్మాణాలపై వైసీపీ వెనక్కి తగ్గలేదా? అమరావతి మునిగిపోతుందంటూ ప్రచారం షురూ చేసిందా? వైసీపీ రూలింగ్ లో ఉన్నప్పుడు నిర్మాణాలు ఆపగా, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టిందా? దీనిపై పాలకపక్షం కౌంటర్లు ఇవ్వలేక ఇబ్బందులు పడుతోందా? ఈ క్రమంలో మంత్రి నారాయణ ఎలాంటి క్లారిటి ఇచ్చారు?
గడిచిన ఆరేళ్ల నుంచి ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. భారీ వర్షం పడితేచాలు అమరావతి మునిగిపోయిందటూ ఒక్కటే ప్రచారం. గ్రాపిక్స్, ఐఏ మాయాజాలంతో ఫోటోలు, వీడియోలతో విడుదల చేస్తూ పదే పదే ప్రచారం చేస్తోంది.
తాజాగా కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ మళ్లీ ప్రచారం వేగవంతం చేసింది. దీనికితోడు వైసీపీ పత్రిక, ఛానెళ్లు, అనుబంధ ఛానెళ్లు పదేపదే ఆ వార్తలను చూపిస్తున్నాయి. వైసీపీ నేతలకు కొందరు ఉద్యోగులు తోడయ్యారు. వాణిజ్య పన్నులశాఖ ప్రాంతీయ అధికారి సుభాష్ అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వివాదాస్పదంగా మారింది.
అధికారి పోస్టులకు అనుకూలంగా రంగంలోకి దిగేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. గోదావరి నది మారిదిగా అమరావతి ఉందంటూ వ్యాఖ్యానించారు. పులస చేపలను రెండు మూడేళ్లలో అమరావతిలో చూడబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి మాటలపై మంత్రి నారాయణ కౌంటరిచ్చారు.
ALSO READ: ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్ బాగోతాలు
వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదన్నారు. అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. 11 వేల మంది పని చేస్తున్నారని, మార్చి నాటికి ఇళ్లను పూర్తి చేస్తున్నామని, రెండుమూడు టవర్ల తప్ప మిగతావి పూర్తి కానున్నట్లు చెప్పుకొచ్చారు.
ఏడాదిన్నరలో రోడ్లు పూర్తి అవుతాయంటూ షెడ్యూల్ బయటపెట్టారు. మూడేళ్లలో ఐకానిక్ భవనాలు రెడీ అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయని వారికి తెలుసని, దానివల్లే ఏదో ఒకటి చెప్పాలని ఆ విధంగా మాటలు ఆడుతున్నారని అన్నారు.
ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. రాజధాని అమరావతిని నది ప్రవాహానికి ఇరువైపులా నిర్మిస్తున్నట్లు 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం వెల్లడించింది. భారీ వరద వస్తే కొంత నీరు నిర్మాణాల్లో రావడం సహజం. ఆ మాత్రం దానికి వైసీపీ ప్రచారానికి కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదని కూటమిలో కొందరు నేతలు అంటున్నారు.
ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు స్కెచ్ వేస్తోందని, వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు అమరావతి గురించి సోషల్ మీడియా, మీడియా ముందు వ్యాఖ్యలు చేసినవారిపై ఆ ప్రాంత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు పోలీసులు అంతా రెడీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే మీడియా ఛానెళ్లు, పత్రికల పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
కేతిరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్
వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదని కొట్టిపారేసిన మంత్రి నారాయణ
అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం
నిన్న అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి https://t.co/DfCliAAqe0 pic.twitter.com/Mc6SdsrMf0
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025