Kukatpally Girl Incident: హైదరాబాద్ కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయ్యింది. క్లూస్ టీం ఫింగర్ ఫ్రింట్‌లాంటి ఆధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. నిందితుల కోసం నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేప ట్టారు. తెలిసిన వారే దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
అటు గాంధీ ఆసుపత్రిలో బాలికకు పోస్టుమార్టం పూర్తయింది. దీంతో స్వస్థలం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోని.. మక్త క్యాసారం గ్రామానికి డెడ్‌బాడీని తరలించారు. ఇక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. బిల్డింగ్ ఓనర్ రమేష్ కూడా తన మనవరాలి చెకప్ కోసం.. హాస్పిటల్‌కి వెళ్లిన సమయంలో ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన..
విషయం తెలియగానే హుటాహుటిన ఇంటికి వచ్చిన బాలిక తల్లి.. కూతురుని చూసి కన్నీరుమున్నీరయ్యింది. ఇంత ఘోరమా..? ఇంత అన్యాయమా..? పాపను చంపిందెవరు..? అంటూ ఏడుస్తోంది. తల్లిదండ్రుల ఆవేదన చూసిన స్థాని కులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
రక్తపు మడుగుల్లో ఉన్న కూతరు..
ఇక బాలిక తండ్రి కృష్ణ మెకానిక్, తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్. వృత్తి రీత్యా ఇరువురు బయటకు వెళ్లారు. ఇదే సమయంలో కుమారుని స్కూల్ నుండి లంచ్ బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో తండ్రి ఇంటికి వచ్చాడు. అయితే ఇంటి తలుపులు తెరవగానే కూతురు గాయాలతో ఉన్నట్లు గమనించాడు. 108కి కాల్ చేశాడు. అయితే అప్పటికే కూతురు చనిపోయినట్లు సమాచారం.
Also Read: ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..
హత్య కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మృతురాలు ఉండే ఇంటి సెకెండ్‌ఫ్లోర్‌లో నివసించే సంజయ్ అనే వ్యక్తి పై.. అనుమానంతో అదుపులో తీసుకున్నారు పోలీసులు. బాలిక నివసిస్తున్న భవనం, చుట్టుపక్కల వారిని పిలిచి విచారణ చేస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రులు చెప్తున్న వివరాల్లో పలు విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో కిచెన్‌లో ఉపయోగించే కత్తితోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన టైంలో కిచెన్‌లో చెల్లాచెదురుగా వంట సామాన్లు పడి ఉన్నాయి. నిందితుడు హత్య తర్వాత అతనితో పాటు కత్తిని తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. పోస్టుమార్టం ప్రాథమిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.