BigTV English

Minority Politics in Madanapalle | మదనపల్లిలో మైనారటీల వైపు వైసీపీ చూపు.. ధీటుగా టిడిపి వ్యూహం

Minority Politics in Madanapalle | ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో మరోసారి మైనారటీ కార్డుతోనే గెలవాలని వైసీపీ సిద్దమైంది. అయితే అభ్యర్థిని మాత్రం మార్చింది. ఈసారి అధికారపక్షం మైనార్టీ ప్రయెగం సక్సెస్ అవుతుందా?. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే వైఖరి కారణంగా.. స్థానికంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని మార్చి మళ్లీ అదే వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం కలిసి వస్తుందా?.. టిడిపి కూడా

Minority Politics in Madanapalle | మదనపల్లిలో మైనారటీల వైపు వైసీపీ చూపు.. ధీటుగా టిడిపి వ్యూహం

Minority Politics in Madanapalle | ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో మరోసారి మైనారటీ కార్డుతోనే గెలవాలని వైసీపీ సిద్దమైంది. అయితే అభ్యర్థిని మాత్రం మార్చింది. ఈసారి అధికారపక్షం మైనార్టీ ప్రయెగం సక్సెస్ అవుతుందా?. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే వైఖరి కారణంగా.. స్థానికంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని మార్చి మళ్లీ అదే వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం కలిసి వస్తుందా?.. టిడిపి కూడా అదే రూటు ఫాలో అవుతుందా? .. లేకపోతే ఓసి అభ్యర్థిని రంగంలో దింపుతుందా?.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వరుసగా ఐదు మంది అభ్యర్థులను మారుస్తూ .. వైసీపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్‌బాషాకి చెక్ పెట్టింది. అయన స్థానంలో రిటైర్ పంచాయతీ రాజ్ ఉద్యోగి అయిన నిస్సార్ అహ్మద్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు కట్టబెట్టింది. నవాజ్‌భాషాపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని సర్వేల్లో తేలిదంటూ ఆయన్ని తప్పించారు.

అయితే నవాజ్‌భాషా , నిస్సార్అహ్మద్‌లు ఇద్దరు ఎన్నికల ముందు వరకు పార్టీకి కొత్త ముఖాలే. ఎప్పుడూ వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. పార్టీకి పనిచేయలేదు. ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యజమాని అయిన నవాజ్‌బాషా ఓవర్‌నైట్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతుడైన నిస్సార్‌ అహ్మద్‌ టికెట్ దక్కించుకున్నారు.


నవాజ్‌భాషా సోదరుడు అయిన షాజహాన్ భాషా 2009 ఎన్నికల్లో మదనపల్లి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. షాజహాన్‌కు అప్పట్లో కాంగ్రెస్ కీలక నేత గులామ్‌ నబీ అజాద్‌తో సత్సంబంధాలు ఉండేవంటారు. అదలా ఉండే ఈ ఇద్దరు సోదరులు తమ వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ.. మిగతాసామాజిక వర్గాల గురించి పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అదే సమయంలో మదనపల్లిలో ఉగ్రవాదులు కూడా దొరకడం వివాదంగా మారింది. దీంతో పాటు కర్నాటక లోని వివిధ ప్రాంతాల నుంచి మైనార్టీలను ఉపాధి పేరుతో నియోజకవర్గాన్ని రప్పించి బలం పెంచుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి.

2014లో జరిగిన ఎన్నికలలో మదనపల్లి నుంచి టిడిపి పోటీ చేయలేదు. అప్పటి పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు కేటాయించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో నవాజ్ భాషా పోటీ చేసినప్పుడు ఆయనకు జగన్ హవాతో పాటు పలు అంశాలు కలిసివచ్చాయన్న విశ్లేషణలు వినిపిస్తుంటాయి. నియోజకవర్గంలో ముస్లీం ఓటర్ల మద్దతు, జనసేన ఓట్లు చీల్చడంతో టీడీపీ ఓటమి పాలలైందంటారు.

ఇక నవాజ్‌భాషా గెలిచాక.. నియోజకవర్గంలో వీధి తగదాలు రివాజుగా మారాయని.. ఓ వర్గానికి చెందిన యువకులు రోడ్డు మీదా రోజూ గొడవలు సృష్టిస్తున్నా.. పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఓ మహిళ టీచర్‌ను నడి రోడ్డు మీద గొంతుకోసి దారుణంగా చంపడం పెద్ద కలకలమే రేపింది. సదరు కేసుకు సంబంధించి ముప్పయి మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలా సెగ్మెంట్లో శాంతి భద్రతల క్షీణించడంతో పాటు.. ప్రైవేటు వ్యక్తుల అస్తుల అక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయన్న ఆరోపణలున్నాయి.

2019లో టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే దొమ్మాల పాటి రమేష్ ప్రస్తుతం మదనపల్లి ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే జిల్లా టీడీపీలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్న ఒక వలస వచ్చిన కీలక నాయకుడు ఈసారి టీడీపీ నుంచి మైనార్టీని రంగంలో దింపాలని.. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ భాషాను పార్టీలో చేర్చుకున్నారు. మరోవైపు పార్టీలోని రమేష్ వ్యతిరేక గ్రూపులు షాజహాన్ తో కలసి పోయాయి. ఇక జనసేన తమకు మదనపల్లి సీటు కావాలని కోరుతోందంట. ఈ పరిణామాలలో మిగతా సామాజిక వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయంట. ఈ సారి ముస్లిం కేండెట్‌కు ఓటేయకూడదని తీర్మానించుకుంటున్నాయని తెలిసింది.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ సైతం ముస్లీం అభ్యర్ధినే బరిలోకి దింపితే.. ఇతర వర్గానికి చెందిన బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపడానికి కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందంట. వాస్తవానికి నియోజకవర్గంలో ముస్లీం ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండరు. బలిజలు, రెడ్డీ, బిసి, కమ్మ , ఎస్ సి సామాజిక వర్గాల ఓటర్లు గణనీయంగా ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లిని అటు వైసీపీ , టీడీపీలు ప్రయోగాలకు వాడుకుంటున్నాయని ఆ పార్టీల కింది స్థాయి కార్యకర్తలు అంటున్నారు.

రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పీలేరు, రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లీం ఓటర్ల ప్రభావం ఎక్కువ. అలాంటి చోట ముస్లీంలకు అవకాశం ఇవ్వకుండా.. మదనపల్లిలో మాత్రమే ఎందుకు టికెట్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. పీలేరు, రాయచోటి సెగ్మెంట్ నేతల ప్రయోజనాల కోసం మదనపల్లిని ప్రమోగశాలగా మారుస్తూ.. పార్టీలో పనిచేసిన వారికి కాకుండా ఎప్పటి కప్పుడు కొత్త వ్యక్తులను అభ్యర్ధులుగా తీసుకురావడంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిలాంటి తరుణంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?.. ఎవరిని మదనపల్లి బరిలో దింపుతుందో చూడాలి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×