E-Paper
Advertisement

MLA KethiReddy Pedda Reddy | ప్రత్యర్థులను వదిలిపెట్టను.. మళ్లీ ఫ్యాక్షన్ మెదలుపెడతా..

MLA KethiReddy PeddiReddy | తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ప్రత్యర్థులను వదిలిపెట్టను.. నాలుగు నెలల తరువాత నా అసలు రూపం చూపిస్తా.. మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా,” అని ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

MLA KethiReddy Pedda Reddy | ప్రత్యర్థులను వదిలిపెట్టను.. మళ్లీ ఫ్యాక్షన్ మెదలుపెడతా..
Advertisement

MLA KethiReddy Pedda Reddy | తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ప్రత్యర్థులను వదిలిపెట్టను.. నాలుగు నెలల తరువాత నా అసలు రూపం చూపిస్తా.. మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా,” అని ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తన ప్రత్యర్థి తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్, టిడిపి సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాను ప్రత్యర్థులను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తేలేదని కేతిరెడ్డి హెచ్చరించారు.

Advertisement

జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను ప్రభుత్వ ఆస్తులు దోచేస్తున్నాననంటూ కరపత్రాలు వేసి మరీ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను రాబోయే రోజుల్లో ఏరేపారేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి ధ్వజమెత్తారు.

తాడిపత్రి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధం అని ఛాలెంజ్ చేశారు. తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి దోచుకున్నారని ఆరోపణలు చేశారు. తనపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదని.. ఇకపై జేసీ అనుచరులు నోరు జారితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

MLA KethiReddy PeddiReddy, aggressive, speech, factionist, target, opponents, Tadipatri, JC Prabhakar Reddy, Andhr a Pradesh news,

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×