BigTV English

MLA Adimulam: హైకోర్టుకు ఎమ్మెల్యే ఆదిమూలం.. హనీట్రాప్ అంటూ కీలక విషయాలు

MLA Adimulam: హైకోర్టుకు ఎమ్మెల్యే ఆదిమూలం.. హనీట్రాప్ అంటూ కీలక విషయాలు

MLA Adimulam: మహిళపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వేధింపుల వ్యవహారాన్ని ఆయన హనీట్రాప్‌గా వర్ణించారు.


ఏపీ రాజకీయాల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారంలో కొత్త ట్విస్ట్. టీడీపీ మహిళా నేతపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన తతంగాన్ని పూసగుచ్చి మరీ వెల్లడించింది.  ఇది టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది.

ALSO READ: ఏపీ రాజకీయాలు పడవల చుట్టూ.. వదిలిపెట్టేది లేదన్న సీఎం


దీనిపై అసలు రగడ ఇప్పుడే మొదలైంది. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఆ పిటిషన్‌లో కీలక విషయాలు వెల్లడించారు.

దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని ప్రస్తావించారు. రెండునెలల కిందట జరిగితే బాధితురాలు ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు చేసిందన్నది మొదటి పాయింట్. ఈ వ్యవహారాన్ని ఆయన హనీట్రాప్‌గా పేర్కొన్నారు. ఏడు పదుల వయసున్న తాను రీసెంట్‌గా గుండెకు స్టెంట్ వేసుకున్నట్లు అందులో వివరించారు.

మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంపై తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కాకపోతే దర్యాప్తు నత్తనడకగా సాగుతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు చెప్పినట్టుగా హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు పోలీసులు.

బాధితురాలికి వైద్య పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు బాధితురాలు మొగ్గు చూడలేదని సమాచారం. పరీక్ష జరిగే వచ్చే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను విచారించాలని భావిస్తున్నారు. ఇదంతా ఒక వెర్షన్.

మరోవైపు సత్యవేడు నియోజకవర్గంలో ఏం జరిగిందన్న దానిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవు తున్నాయి. త్వరలో నామినేటెడ్ పదవుల కోసం పార్టీలో కొందరు నేతలు కుట్ర చేసినట్టు వార్త గుప్పుమంది. దీంతో ఎమ్మెల్యేకు మద్దతుగా కొన్ని ఎస్సీ మహిళా సంఘాలు ఆందోళనకు దిగడం, వాస్తవాలు తేల్చాలంటూ కలెక్టర్‌ని వినతి పత్రం సమర్పించడం జరిగిపోయింది.

ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో స్థానిక నేతలు.. ఎమ్మెల్యే-బాధితురాలి మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.  చేయని తప్పుకు తాను బాధ్యత వహించేది లేదని సదరు ఎమ్మెల్యే బంధువుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ కేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Amaravati News: పైసా మే ప్రమోషన్‌ చిచ్చు.. సాక్షి పత్రికపై కేసు నమోదు

CM Chandrababu: సీఎం బాబు @30.. సాక్షిలో ఊహించని ప్రచారం

Miss Visakhapatnam 2025: విశాఖ అందాల తార ఈ యువతే.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

AP rains: వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాల పైనే.. బిగ్ అలర్ట్ అంటున్న అధికారులు!

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

Big Stories

×