EPAPER

Prakasam Barrage Boats: పడవల చుట్టూ ఏపీ రాజకీయాలు.. లక్ష మందిని చంపే కుట్ర?

Prakasam Barrage Boats: పడవల చుట్టూ ఏపీ రాజకీయాలు.. లక్ష మందిని చంపే కుట్ర?

Prakasam Barrage Boats: ఏపీలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. వరద రాజకీయాలు కాస్త.. బోట్ల వైపు మళ్లింది. దీనిపై అధికార టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇప్పటి వరకు కేవలం సోషల్‌మీడియా ద్వారా ఎటాక్ చేసే ప్రయత్నం చేసింది వైసీపీ. ఈసారి మాజీ మంత్రి, మాటల మాంత్రికుడు అంబటి రాంబాబును రంగంలోకి దింపారు జగన్. ఈ వ్యవహారం వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారని చంద్రబాబు సర్కార్ మాట. లక్ష మందిని చంపే కుట్రన్నది టీడీపీ నేతల మాట.


విజయవాడ వరదల సమయంలో ఎగువ ప్రాంతాలను మూడు బోట్లు వచ్చాయి. వరద ప్రవాహానికి నేరుగా వచ్చిన ఆ బోట్లు ప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టాయి. ప్రస్తుతం ఆ బోట్లను బయటకు తీయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కనీసం ఇక్క ఇంచీ కూడా కదపలేకపోయింది.

ALSO READ: ఫ్యాన్‌కు రిపేర్లు.. జగన్ సలహాదారుడిగా సాయిదత్.. అజ్ఞాతంలో సజ్జల!


బోట్లను బయటకు తీసేందుకు బుధవారం విశాఖ నుంచి మెరైన్ టీమ్ వస్తోంది. వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటకు తీయనున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు దర్యాప్తు వేగంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.

ప్రస్తుతం కాల్ డేటా విశ్లేషించే పనిలోపడ్డారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్‌ని కూల్చాలని ప్యాలెస్ నుంచి సలహాదారునికి సంకేతాలున్నట్లు తెలుస్తోంది. ఆ ఆదేశాలను కింది స్థాయివారికి అప్పగించారట. ఘటన తర్వాత సంబంధిత వ్యక్తులు పరారీలో ఉన్నట్లు వార్తలు లేకపోలేదు.

ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం బుడమేరు పరీవాహక ప్రాంతాలను సందర్శించారు. మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఫ్యాన్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకుని వచ్చారని, వాటిని తొలగిస్తామన్నారు.. నేరస్తులను ఎలా ట్రీట్ చేయాలో అలాగే చేస్తామన్నారు’ ముఖ్యమంత్రి. ఈ విషయంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి, ఆర్గ్యుమెంట్ చేయడాన్ని తప్పుబట్టారు. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. లంగర్ లేకుండా తాడుతో బోట్లను కడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోట్ల వ్యవహారంపై తొలిసారి వైసీపీ స్పందించింది. ఈ ఘటనతో మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మొన్నటి వరదలకు వందల బోట్లు బ్యారేజ్ దిగువకు కొట్టుకువచ్చాయంటూ కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఈ మూడు బోట్లు పెద్దవి కావడంతో గేట్ల వద్ద చిక్కుకుపోయానన్నారు. ఇదంతా వైసీపీ చేసిందంటూ ప్రభుత్వం చెప్పడాన్ని తోసిపుచ్చారాయన.

మానవ తప్పిదం వల్లే కృష్ణాకు వరదలు వచ్చాయంటూ వైసీపీ మొదటి నుంచి చెప్పేమాట. అంబటి కూడా అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. క్లియర్‌గా కనిపిస్తోందని, అదే చెప్పామన్నారు. కానీ.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడింది. కృష్ణాకు వరదలను సృష్టించడం, వ్యక్తి వల్ల.. వ్యవస్థ వల్ల అవుతుందా? ఇదే అంబటి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related News

Pawan Kalyan : ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకోను… ఉపముఖ్యమంత్రి ‘పవనాగ్రహం’

Elephants Attack on Farmers: రైతులను బలి తీసుకుంటున్న ఏనుగులు.. పవన్ ఇచ్చిన ఆ మాట ఏమైనట్లు?

AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు షాకింగ్ న్యూస్.. ఆ జీవో జారీ చేయాలంటున్న బ్రాహ్మణ చైతన్య వేదిక.. ప్రభుత్వం ఎలా స్పందించెనో ?

Ap Home Minister : 48 గంటల్లోనే అత్తా కోడళ్లపై అత్యాచారం నిందితులను అరెస్ట్ చేశాం : హోంమంత్రి అనిత

CM Chandrababu: ఆ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఫస్ట్ టైమ్ సీఎం చంద్రబాబు సీరియస్.. 18న కూడా ..?

TTD Chairman: టీటీడీ ఛైర్మన్ పదవి రాజుకే అవకాశాలెక్కువా?

New Industrial Policy: ఏపీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం, కేబినెట్ ఆమోదం తర్వాత..

Big Stories

×